Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘సిక్స్‌‌’తో గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన ధోని

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని అద్భుత ప్రదర్శన చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 63 పరుగులతో అర్ధ సెంచరీని సాధించాడు. వన్డే కెరీర్‌లో ధోనికి ఇది 62వ అర్ధ సెంచరీ. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 33.3 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. యువీ అవుటైన తర్వాత ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనిపై ఒత్తిడి ఉంటుందని అంతా భావించారు.

ICC Champions Trophy 2017: MS Dhoni goes past Sourav Ganguly

అయితే సిక్స్‌తో పరుగులు ఖాతా తెరిచిన ధోని చివరి ఓవర్ వరకూ శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన ధోని విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉండేది.

కాగా, 49.2వ ఓవర్లో చండీమాల్‌ బౌలింగ్‌లో ధోనీ అవుటైన సంగతి తెలిసిందే. 296 మ్యాచ్‌లాడిన గంగూలీ 159 సిక్సర్లు బాదగా, 281 మ్యాచ్‌ల్లోనే ధోని 161 సిక్స్‌లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాట్స్ మెన్ మ్యాచ్‌ పరుగులు అత్యధిక స్కోరు 100s 4s 6s
Shahid Afridi 450 9,188 141 9 843 402
Chris Gayle 248 10,704 333 27 1313 277
Sanath Jayasuriya 392 12,974 253 26 1522 261
Shane Watson 205 6,928 185* 9 756 183
AB de Villiers 226 10,515 278* 25 991 175
Misbah-ul-Haq (Pakistan) 243 10,318 161* 10 832 171
Brendon McCullum 238 7,110 225 8 729 168
Ricky Ponting 311 14,366 206 35 1501 165
MS Dhoni 281 8,618 148 4 767 161
Ganguly (India) 296 12,285 183 26 1309 159
Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+