Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేనను ఓడించడం కష్టమే: లంక కెప్టెన్ (వీడియో)

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో బెర్తే లక్ష్యంగా గురువారం శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై కూడా మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి సెమీస్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఘోరపరాజయం పాలైన లంకకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాగా మారింది. సెమీస్‌పోరులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లంక కచ్చితంగా నెగ్గాలనే ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా లంక కెప్టెన్ మాథ్యూస్‌ మీడియాతో మాట్లాడాడు.

'ఛాంపియన్స్‌ ట్రోఫీలో అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం కష్టమే. తాము మెరుగైన ప్రదర్శన చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది' అని మాథ్యూస్‌ పేర్కొన్నాడు. గురువారం జరగబోయే మ్యాచ్‌లో తమ జట్టు చివరి వరకు విజయం కోసం ప్రయత్నిస్తుందని చెప్పాడు.

సంధి కాలంలో శ్రీలంక జట్టు

సంధి కాలంలో శ్రీలంక జట్టు

2015 వన్డే ప్రపంచకప్‌ తర్వాత దిగ్గజాలు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత శ్రీలంక సంధికాలాన్ని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి ఇప్పటి దాక నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌ కొరత జట్టును వేధిస్తోంది. దానిని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఆ జట్టుకు కలిసిరావడం లేదు.

పూర్తిగా కోలుకున్న కెప్టెన్ మాథ్యూస్

పూర్తిగా కోలుకున్న కెప్టెన్ మాథ్యూస్

సీనియర్లు లేకపోవడం శ్రీలంకను ప్రధానంగా వేధిస్తోంది. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ మాథ్యూస్ పూర్తిగా కోలుకున్నాడు. భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నా బౌలింగ్ చేయడం అనుమానంగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుకి సారథ్యం వహించిన ఉపుల్‌ తరంగ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు.

ఉపుల్ తరంగ స్ధానంలో కుశాల్ పెరీరా

ఉపుల్ తరంగ స్ధానంలో కుశాల్ పెరీరా

ఇతని స్థానంలో కుశాల్ పెరీరాకు అవకాశం దక్కనుంది. మరోవైపు కపుగెదెరకు సంబంధించి ఎమ్‌ఆర్‌ఐ రిపోర్టు అందాల్సి ఉంది దీనిని బట్టి అతనికి విశ్రాంతి కల్పించాలా లేదా అన్న దానిపై దృష్టి పెడతామని, ఒకవేళ కపుగెదెర మ్యాచ్‌కి దూరమైతే అతని స్థానంలో ధనుష్కను జట్టులోకి తీసుకుంటామని మాథ్యూస్‌ తెలిపాడు.

లసిత్ మలింగ్ పైనే భారం

లసిత్ మలింగ్ పైనే భారం

లంక బౌలింగ్‌ మొత్తం మలింగపైనే ఆధారపడి ఉంది. అతను సరైన శుభారంభం ఇస్తే జట్టుకు తిరుగుండదు. ఇక లక్మల్, ప్రదీప్ సత్తా చాటాల్సి ఉంది. మొత్తంగా 2007-14 మధ్యకాలంలో ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఆడిన శ్రీలంక ఇప్పుడు ఆ స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+