హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు వారు బస చేసిన హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో మ్యాచ్ జరిగే ఓవల్ స్టేడియానికి చేరుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఇటీవలే లండన్‌లో ఉగ్రదాడి జరిగిన నేఫథ్యంలో హై సెక్యూరిటీ మధ్య టగాళ్లు హోటల్ నుంచి స్టేడియానికి వచ్చారు. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన క్రికెటర్లను ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. శ్రీలంక క్రికెటర్లు ముందుగా స్టేడియానికి చేరుకున్నారు.

భారత క్రికెటర్లకు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై కూడా మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి సెమీస్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది.
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఘోరపరాజయం పాలైన లంకకు ఈ మ్యాచ్ చావోరేవోలాగా మారింది. సెమీస్‌పోరులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లంక కచ్చితంగా నెగ్గాలనే ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. 2007-14 మధ్యకాలంలో ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఆడిన శ్రీలంక ఇప్పుడు ఆ స్థాయిలో రాణించడం లేదు.
కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2015 వన్డే ప్రపంచకప్ తర్వాత దిగ్గజాలు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత శ్రీలంక సంధికాలాన్ని ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి ఇప్పటి దాక నమ్మకమైన బ్యాట్స్‌మెన్ కొరత జట్టును వేధిస్తోంది. దానిని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఆ జట్టుకు కలిసిరావడం లేదు.