ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు
హైదరాబాద్: జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ విధించిన డెడ్‌లైన్ ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఇండియా తప్ప అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.
అయితే ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనడం లేదని వార్తలు వచ్చాయి. అయితే చివరకు బీసీసీఐ పరిపాలనా కమిటీ హెచ్చరికతో ఎట్టకేలకు 8వ తేదీన బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టుని సోమవారం బీసీసీఐ ప్రకటించింది.
దీంతో ఎనిమిది దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీకి లండన్ ఆతిథ్యమిస్తోంది. 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. టీమిండియా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.
నాలుగు జట్లు రెండు గ్రూపులుగా ఆడుతున్నాయి. రెండు గ్రూపుల్లోని టాప్ రెండు జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా గ్రూప్ బిలో ఇండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా శ్రీలంకలు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో పాల్గొంటున్న 8 దేశాల జట్ల పూర్తి వివరాలు:

ఇండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, ధోనీ, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జాస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా:
స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ప్యాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్, జాన్ హాస్టింగ్స్, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, హెన్రిక్వెస్, క్రిస్ లిన్, గ్లేన్ మాక్స్‌వెల్, జేమ్స్ ప్యాటిన్సన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనిస్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా.

దక్షిణాఫ్రికా:
ఏబీ డివీలియర్స్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, ఫర్హాన్ బెహర్డిన్, క్వింటన్ డికాక్, జెపి డుమినీ, డుప్లెసిస్, ఇమ్రాన్ తహీర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మోర్నే మార్కెల్, క్రిస్ మోరిస్, వేన్ పార్నెల్, అండిల్ పెహ్లెక్వయో, డ్వెయిన్ ప్రెటోరియస్, కగిసో రబాడా.

శ్రీలంక:
ఎంజిలో మాథ్యూస్(కెప్టెన్), ఉపుల్ తరంగ, నిరోషన్ డిక్‌వెల్ల, కుశాల్ పెరారా, కుశాల్ మెండిస్, చమర కపుగెదరా, అసెల గుణరత్నె, దినేష్ చండీమాల్, లసిత్ మలింగ, సరంగ లక్మల్, నెవాన్ ప్రదీప్, నువాన్ కులశేఖర, తిశార పెరార, లక్షన్ సండకన్, ప్రసన్న.

ఇంగ్లాండ్:
ఇయాన్ మెర్గాన్(కెప్టెన్), మోయిన్ అలీ, బెయిర్‌స్టో, జేక్ బాల్, శ్యామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, లియామ్ ఫ్లంకెట్, అదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్‌స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

న్యూజిల్యాండ్:
కేన్ విలియమ్సన్(కప్టెన్), మార్టిన్ గుప్తిల్, టామ్ లాథమ్, ల్యూక్ రోంచి, రాస్ టేలర్, నీల్ బ్రూమ్, జిమ్మీ నీషమ్, కోరీ అండర్సన్, సాంట్నర్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాతన్ పటేల్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, మిచెల్ మెక్లెంగన్, ట్రెంట్ బౌల్ట్.

పాకిస్థాన్:
సర్ఫ్‌రాజ్ అహ్మద్(కెప్టెన్), అజార్ అలీ, అహ్మద్ షెహ్జాద్, మహ్మద్ హఫీజ్, బాబర్ ఆజమ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, ఫఖర్ జమన్, ఇమాద్ వసిమ్, హాసన్ అలి, ఫహిమ్ అష్రఫ్, వాహబ్ రియాజ్, మహ్మద్ అమిర్, జనైద్ ఖాన్, షదబ్ ఖాన్.

బంగ్లాదేశ్:
తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ఇమ్రుల్ కేస్, ముష్ఫికర్ రహీమ్, షకిబుల్ హాసన్, మహ్మదుల్లా, షబ్బీర్ రహీమ్, మొసడెక్ హుస్సేన్, మెహదీ హాసన్, సున్జముల్ ఇస్లాం, ముష్రఫీ బిన్ మూర్తజా(కెప్టెన్), ముస్తఫిజుర్ రహీమ్, టస్కిన్ అహ్మద్, రుబెల్ హుస్సేన్, షఫియుల్ ఇస్లాం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications