ఆసీస్‌కు కష్టమే!: వర్షంతో బంగ్లా మ్యాచ్ రద్దు (ఫోటోలు)
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుని వర్షం దురదృష్టం రూపంలో వెంటాడుతోంది. మరోసారి వర్షం ఆస్ట్రేలియా కోలుకోలేని దెబ్బ తీసింది. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మ్యాచ్‌ని రద్దు అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ ; ఫోటోలు ; స్కోరు కార్డు
దీంతో గెలిచే మ్యాచ్‌లోనూ చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరు జట్లకు అంఫైర్లు చెరో పాయింట్ ఇచ్చారు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తోలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో అప్పుడు కూడా ఒక పాయింట్‌తో ఆస్ట్రేలియా సరిపెట్టుకుంది.
ప్రస్తుతం టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా రెండుపాయింట్లతో కొనసాగుతోంది. సెమీఫైనల్‌లో అడుగుపెట్టాలంటే ఇంగ్లాండ్‌తో జూన్ 10న జరగనున్న చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు వర్షం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో కనుక బంగ్లాదేశ్ ఓడి ఉంటే ఆ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకునేది.

బంగ్లా 44.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మిచెల్ స్టార్క్ (4/29), ఆడమ్ జంపా (2/13)లతో పాటు మిగతా బౌలర్లూ రాణించడంతో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు.

రాణించిన తమీమ్ ఇక్బాల్
తమీమ్ ఇక్బాల్ తర్వాత ఆ జట్టులో షకిబ్ ఉల్ హాసన్ (29), మెహదీ హసన్ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఓ దశలో 141/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న బంగ్లాదేశ్ ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.

ఆసీస్ విజయ లక్ష్యం 183
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. ఫించ్ (19) అవుటయ్యాడు.

మరో నాలుగు ఓవర్లు మ్యాచ్ కొనసాగి ఉంటే విజయం ఆసీస్‌దే
డక్‌వర్త్/లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్ విజయానికి అవసరమైన పరుగులు సాధించింది. మరో నాలుగు ఓవర్లు మ్యాచ్ కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌ను వరించేది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల ఆట అయితే తప్ప ఈ పద్ధతిలో విజేతను ప్రకటించరు.

ఇరు జట్లకు చెరో పాయింట్
కానీ వరుణుడు ఎంతకు తెరిపినివ్వకపోవడంతో అంఫైర్లు ఇక మ్యాచ్ జరగడం వీలుకాదని తేల్చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. కాగా, తన తొలి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా కష్టాల్లో ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ రద్దయి ఆ జట్టుకు ఒక పాయింట్ వచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications