ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నసంగతి తెలిసిందే. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ కొత్త ఛైర్మన్ జై షా కూడా కుంభమేళాను సందర్శించారు. తన కుటుంబంతో కలిసి ప్రయాగరాజ్ ను సందర్శించారు. ఎయిర్ పోర్టులో దిగగానే జై షాకు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
అనంతరం జై షా.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. జై షా తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ కుంభమేళను సందర్శించి పుణ్య స్నానం ఆచరించారు. అలాగే జై షా.. నెలల వయసున్న తన కొడుకును కూడా కుంభమేళాకు తీసుకెళ్లారు. అక్కడి సాధువులు జైషాతో పాటు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు జైషా అయోధ్య హనుమాన్ గర్హి దేవాలయాన్ని సందర్శించారు.

సరికొత్త శిఖరాలకు
ఇటీవలే జై షా.. ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. ఆ సమయంలో.. క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. రీసెంట్ గానే కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) సలహా మండలిలోనూ జై షాకు స్థానం దక్కింది. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు ఈ సలహా మండలిని ఏర్పాటు చేశారు.
#WATCH | #MahaKumbh2025 | Saints bless the baby boy of Jay Shah - ICC chairman and son of Union Home Minister Amit Shah in Prayagraj, Uttar Pradesh. pic.twitter.com/97qA7hwuOb
— ANI (@ANI) January 27, 2025