Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యోగా డేతో పాటు సెల్ఫీ డే: ఐసీసీ ట్విట్టర్‌లో ఫోటోలతో సందడి

Icc Celebrate World Selfie Day 2018

హైదరాబాద్: గత నాలుగేళ్లుగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

అయితే, జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కొన్ని ఫోటోలను తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

'మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి' అంటూ ఐసీసీ ఆ ట్వీట్‌లో కొన్ని ఫోటోలను పోస్టు చేసింది. ఇందులో గతేడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి.

ఐసీసీ అభిమానులతో షేర్‌ చేసిన ఫోటోల్లో పృథ్వీ షా నేతృత్వంలోని అండర్‌-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు కూడా ఉంది. మరోవైపు 2017 మహిళల ప్రపంచ కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మహిళా జట్టు సెల్ఫీ ఫోటోతో పాటు 2018లో ఛాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్‌ జట్టు ఫోటో, ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి.

Story first published: Thursday, June 21, 2018, 13:14 [IST]
Other articles published on Jun 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+