ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కీలక ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. పాకిస్థాన్‌కు ఎట్టిపరిస్థితిలో టీమిండియాను పంపే అవకాశమే లేదని బీసీసీఐ తేల్చడంతో ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌పై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఐసీసీ ట్రోఫీ జరగాల్సి ఉంది.
ఈ మెగాటోర్నీకి 100 రోజుల కౌంట్‌డౌన్‌తో సోమవారం కీలక ఈవెంట్‌ను నిర్వహించాలని ఐసీసీ తొలుత నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో మెగాటోర్నీలో పాల్గొనే 8 జట్ల జెండాలను ప్రదర్శించాలి ఉంది. అయితే పాకిస్థాన్‌కు తమ జట్టును పంపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదని బీసీసీఐ తేల్చేసి చెప్పడం, టీమిండియాను మా దేశానికి తీసుకురావాలని పాకిస్థాన్ ఒత్తిడి చేయడంతో ఐసీసీ ఈవెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది.

2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. ఇటీవల పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంక వేదికగా మ్యాచ్‌లు ఆడింది.
అదే తరహాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్‌లు కూడా ఇతర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీతో చెప్పింది. భారత మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ, శ్రీలంక రేసులో ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్ బాధ వర్ణనాతీతం. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌కు పాకిస్థాన్ వచ్చింది. అలానే టీమిండియా కూడా వస్తుందని అనుకుంది. కానీ బీసీసీఐ నో అని తేల్చిచెప్పింది. ఇది పాకిస్థాన్‌కు ఆర్థికంగా దెబ్బ మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై తమ బోర్డుకు శక్తి లేదని తెలిసిపోతుందని పాకిస్థాన్ బాధపడుతోంది.
మరోవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు పట్టుబడితే..మెగాటోర్నీ నిర్వహణ కష్టమని, రద్దు చేయడమే మార్గమవుతుందని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయంటూ కథనాలు వస్తున్నాయి.