Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసు.. ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ కొరడా! ఏకంగా!

ICC bans UAE players Mohammad Naveed and Shaiman Anwar Butt for 8 years for trying to fix matches

దుబాయ్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరు క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. 2019 టీ20 ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లు మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్ బట్‌లపై‌ ఐసీసీ మంగళవారం చర్యలు తీసుకుంది. ఈ ఇద్దరిపై ఏకంగా ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. 2019 అక్టోబర్‌ 16 నుంచి శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రాథమికంగా తప్పు చేసినట్టు తేలడంతో.. ఐసీసీ రెండేళ్ల క్రితమే వారిపై తాత్కాలిక నిషేధం అమలు చేసింది.

'మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌ బట్ యూఏఈ తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడారు. నవీద్‌ జట్టుకు కెప్టెన్ కూడా. జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. అన్వర్‌ యూఏఈ జట్టుకి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానూ సేవలందించాడు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న వీరికి మ్యాచ్‌ ఫిక్సర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దాంతో వారు సహచరులు, ప్రత్యర్థులు, అభిమానులను మోసం చేశారు' అని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.4.4 ప్రకారం మహ్మద్‌ నవీద్‌, షైమన్‌ అన్వర్‌ బట్‌లను‌ ఐసీసీ దోషులుగా పరిగణించి చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఎవరైనా కలిసినా, ఫిక్సింగ్ చేయమని ప్రేరేపించినా, మ్యాచ్ వివరాలు అడిగినా ఐసీసీ అధికారులకు తెలియజేయాలి. ఈ ఇద్దరు ఆ వివరాలను వెల్లడించలేదు. అందుకే ఐసీసీ వారిపై నిషేధం విధించింది.

కుడిచేతి వాటం పేసరైన మహ్మద్‌ నవీద్ (32 ఏళ్లు)‌ యూఏఈ తరఫున 39 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన ఓసారి చేశాడు. అంతేకాదు యూఏఈ జట్టుకు సారథ్యం వహించాడు. ఇక 42 ఏళ్ల మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ షైమన్‌ అన్వర్‌‌ బట్‌ 40 వన్డేలు, 32 టీ2లు ఆడాడు. వన్డేల్లో 1219 రన్స్, టీ20ల్లో 971 పరుగులు చేశాడు. వన్డే టీ20 ఒక్కో సెంచరీ చేశారు.

Story first published: Wednesday, March 17, 2021, 8:00 [IST]
Other articles published on Mar 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+