Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ కీలక నిర్ణయం.. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల క్రికెట్‌లో ఒకపై ట్రాన్స్‌జెండర్లను ఆడించకూడదని డిసైడ్ అయింది. మహిళా క్రికెట్‌ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీనిపై పలువురు క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇది సరైన నిర్ణయం కాదని కొందరు ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ నిబంధనల ప్రకారం పుట్టినప్పుడు 'పురుషుడు'గా ఉన్న వాళ్లు.. అబ్బాయిలుగా ఎదిగిన తర్వాత ప్యూబర్టీ ముగిసిన తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేయించుకున్నా సరే.. వారిని మహిళల క్రికెట్‌లోకి అనుమతించడం జరగదు. సుమారు 9 నెలలపాటు ఐసీసీ బోర్డు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్.. దీనిపై సమాలోచనలు జరిపారు. ఆ తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ICC bans transgenders from participating in womens cricket

ఈ డెసిషన్‌తో క్రికెట్‌లో పోటీతత్వం, ఫెయిర్‌నెస్ నిలబడతాయని ఐసీసీ భావిస్తోంది. 'ఈ జెండర్ అర్హత నిబంధనల్లో మార్పులు చేసే ముందు చాలా కాలం కన్సల్టేషన్ నిర్వహించాలం. అలాగే సైన్స్ పరంగా ఆలోచించిన తర్వతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందర్నీ కలుపుకొని వెళ్లడం ఒక క్రీడగా మాకు చాలా ముఖ్యం. కానీ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ను కాపాడటం, ప్లేయర్ల రక్షణ మాకు అంతకంటే ముఖ్యం' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ ఆలర్డైస్ చెప్పారు.

ICC bans transgenders from participating in womens cricket

ఈ నిబంధనలు కేవలం మహిళల అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే వర్తిస్తాయి. దేశవాళీల్లో ఆడుకోవచ్చు. దీనిపై ఆయాదేశాల క్రికెట్ బోర్డులే ఒక నిర్ణయం తీసుకుంటాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మాత్రం ట్రాన్స్‌జెండర్లను కూడా మహిళా క్రికెట్‌లోకి అనుమతించాలని కోరుతోంది. సదరు ప్లేయర్ తను మహిళను అని నమ్మితే దాన్ని గౌరవించి, కలుపుకొని పోవాలని చెప్పింది. మరి దీనిపై మిగతా క్రికెట్ బోర్డులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Story first published: Wednesday, November 22, 2023, 13:31 [IST]
Other articles published on Nov 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+