Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ నయా ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం

శ్రీలంక టీ20 కెప్టెన్, సన్‌రైజర్స్ నయా ఆల్‌రౌండర్ వానిందు హసరంగపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. రెండు మ్యాచ్‌ల పాటు నిషేధాన్ని విధించింది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో అంపైర్‌ను దూషించినందుకు హసరంగపై కొరడా ఝుళిపించింది. వ్యక్తిగత విమర్శలు చేసిందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగిందంటే.. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంక మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అంపైర్ ఘోర తప్పిదం చేశాడని హసరంగ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేగాక అంపైర్‌పై ఘూటు విమర్శలు చేశాడు. ఆఖరి ఓవర్‌లో వఫదర్ వేసిన హైఫుల్ టాస్ లంక బ్యాటర్ మెండిస్‌ నడుమ కంటే ఎక్కువ ఎత్తులో వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. కానీ అంపైర్ నోబాల్ ఇవ్వలేదు.

ICC ban on Sunrisers new all-rounder Wanindu Hasaranga two match ban for abusing umpire

మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోనే హసరం తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతేగాక ప్రెజెంటేషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న తర్వాత అంపైర్‌ను విమర్శించాడు. ''అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దు. నడుమ ఎత్తు వరకు వచ్చి, స్పష్టంగా నిర్ణయాలు వెల్లడించలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు వెల్లడిస్తే ఓ అర్థం ఉంటుంది. కానీ అది చాలా ఎత్తులో వచ్చింది. కాస్త ఎత్తులో వస్తే బ్యాటర్ తలకు బంతి కూడా తగిలేది. ఇది కూడా గమనించలేకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైరింగ్ చేయడం అనవసరం. వేరే పని ఏదైనా చూసుకుంటే మంచిది'' అని హసరంగ అన్నాడు.

ఈ విషయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగిణించింది. హసరంగపై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. కాగా, ఇటీవల జరిగిన వేలంలో హసరంగను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తాచాటగలిగే ఈ ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ వదులుకుంది. వేలంలో రూ.1.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొదటి 21 మ్యాచ్‌లకు మాత్రమే ఐపీఎల్ షెడ్యూల్ విడుదుల చేశారు.

ఈ తొలిదశ షెడ్యూల్‌లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. మార్చి 23న ముంబైతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో మ్యాచ్ జరగనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు హోమ్ గ్రౌండ్‌లో మరో రెండు అవే గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్.. కేకేఆర్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో తలపడనుంది.

Story first published: Sunday, February 25, 2024, 9:03 [IST]
Other articles published on Feb 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+