For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదే తొలిసారి, గొప్ప గౌరవం: సర్ గ్యారీ సోబర్స్ ట్రోఫీకి ఎంపికపై కోహ్లీ

By Nageshwara Rao
ICC Awards: Virat Kohli wins Sir Garfield Sobers Trophy for Cricketer of the Year

హైదరాబాద్: 2017 సంవత్సరానికి అంతర్జాతీయ్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మా్ట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.

ఈ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రతిష్టాత్మక సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ వరించింది. టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. ఈ అవార్డుకి కోహ్లీ ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది మూడు ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

దీంతో పాటుగా విరాట్ కోహ్లీని ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు కూడా వరించాయి. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకోవడం విరాట్ కోహ్లీ ఇది రెండోసారి. 2012లో చేసిన ప్రదర్శనకు గాను కోహ్లీ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు.

ఈ అవార్డులను సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 2017 వరకు ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ప్రకటించింది. గతేడాది విరాట్ కోహ్లీ టెస్టుల్లో 77.80 యావరేజితో 2,203 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 82.63 యావరేజితో 1,818 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు టీ20ల్లో 153 స్ట్రయిక్ రేట్‌తో 299 పరుగులు చేశాడు.

అంతేకాదు టీమిండియాను టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టాడు. తనకు ఐసీసీ అవార్డులు రావడంపై కోహ్లీ మాట్లాడుతూ 'ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ఇయర్ అవార్డులతో పోలిస్తే సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందుకోవడం ఎంతో ప్రత్యేకం' అని అన్నాడు.

'మొట్టమొదటి సారి సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రపంచ క్రికెట్‌లో ఇదే అతిపెద్ద గౌరవం. ఈ గౌరవం కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే దక్కింది. గతేడాది అశ్విన్‌కు దక్కగా ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకెంతో గౌరవంగా ఉంది. ఐసీసీ నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిగతా విభాగాల్లో అవార్డుల గెలిచిన వారికి నా అభినందనలు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

గతేడాది సర్‌ గార్‌ఫీల్డ్ సోబెర్స్‌ ట్రోఫీని రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 25 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను చాహల్‌ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే 2017 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంపికయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 13:37 [IST]
Other articles published on Jan 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+