Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనిని మిస్సయ్యాడు: అశ్విన్‌ది 'అహంకారం' అన్న నెటిజన్లు

హైదరాబాద్: 2016 టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఎంతో గుర్తుంచుకోతగ్గ సంవత్సరం. ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో పాటు ఐసీసీ ప్రకటించిన వార్షిక అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుని రెట్టింపు ఆనందాన్ని పొందాడు.

గురువారం ఐసీసీ ప్రకటించిన వార్షిక అవార్డుల్లో 'క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కైవసం చేసుకుని అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒకే సంవత్సరంలో రెండు అవార్డులు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

దీంతో అశ్విన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, టీమిండియా హెడ్ కోచ్‌ అనిల్ కుంబ్లే, టీమిండియా వెటరన్ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌, సహా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, కామెంటేటర్లు అశ్విన్‌కు అభినందనలు తెలిపారు.

ఐసీసీ ప్రతిష్టాత్మక రెండు టాప్ అవార్డులను కైవసం చేసుకున్న అశ్విన్ ట్విట్టర్‌లో స్పందించాడు. 'నా జీవితం పూలపాన్పు కాదు. కానీ నా మార్గంలో ఆ ముళ్లే ఎదురుకాకపోయింటే ఓ వ్యక్తిగా నేను ఇప్పుడు ఉన్న స్థాయిలో సగం కూడా అయ్యేవాడిని కాదు' అని ట్వీట్‌ చేశాడు.

ఈ సందర్భంగా తన భార్య ప్రీతి, హెడ్ కోచ్‌ అనిల్ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ట్రైనర్‌ బసు, శ్రీధర్‌, భరత్‌ అరుణ్‌ తదితరులకు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు చెప్పాడు. అయితే అశ్విన్ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కృతజ్ఞతలు చెప్పలేదు.

దీంతో అశ్విన్ తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అశ్విన్ ఈరోజు ఇలా ఉండటానికి, జట్టులో అశ్విన్ స్ధానం పదిలం అవడానికి పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కారణం అయ్యాడని, ధోనికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ట్విట్టర్‌లో అశ్విన్‌పై మండిపడ్డ అభిమాని

కృతజ్ఞతలు చెప్పడంలో ధోనిని ఎందుకు మిస్సయ్యావంటూ ఓ అభిమాని ప్రశ్న.

అశ్విన్‌ను భలే అడిగాడులే!

ధోని పేరుని ఎందుకు మరిచిపోయావంటూ అశ్విన్‌ని ప్రశ్నించిన ఓ అభిమాని.

శ్రీకాంత్ గౌతమ్

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అశ్విన్ కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోయాడు. టీమిండియాలో అశ్విన్ స్ధానం పదిలం కావడంలో ధోని పాత్ర కూడా ఉంది.

శాంతను శర్మ

తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో సహకరించిన ధోనిని అశ్విన్ మరిచిపోయాడు. నేను అశ్విన్ అభిమాని అయినప్పటికీ దీనిని అహంకారంగా భావిస్తున్నాను.

పియూష్ చావ్లా

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపావు కానీ చెన్నై సూపర్ కింగ్ టు టీమిండియాలోకి అవకాశాలు కల్పించిన ధోనిని మాత్రం మరిచిపోయావంటూ క్రికెటర్ పీయూష్ చావ్లా పేర్కొన్నాడు.

ధోని అశ్విన్‌ను ఎంతగానో విశ్వసించాడు

టీమిండియా జట్టులోకి చెన్నై సూపర్ కింగ్స్ కోటా నుంచి వచ్చావని అందరూ నమ్ముతున్నారు. 2011 నుంచి కూడా ధోని అశ్విన్‌ను ఎంతగానో ప్రోత్సహించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+