21న ఐసీసీ అవార్డుల ప్రకటన: ఆశలన్నీ కోహ్లీ పైనే
హైదరాబాద్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ప్రకటించే అవార్డుల్లో అరుదైన గౌరవం దక్కించుకునే అవకాశం ఉండేలా కనిపిస్తోంది. 2015 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఏ ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కించుకోలేదు.
అయితే ఐసీసీ టెస్టు, వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులతో పాటు వ్యక్తిగత విభాగాలకు సంబంధించి ఐసీసీ అవార్డులను బుధవారం డిసెంబర్ 21న ప్రకటించింది. 14 సెప్టెంబర్ 2015 నుంచి 20 సెప్టెంబర్ 2016 మధ్య కాలంలో ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ జట్లను ఐసీసీ ఎంపిక చేస్తుంది.
ఇక వ్యక్తిగత విభాగానికి సంబంధించిన అవార్డుల విషయానికి వస్తే రాహుల్ ద్రవిడ్, గ్యారీ క్రిస్టెన్, కుమార సంగక్కర నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్‌ను ఎంపిక చేయనుంది. 2015 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

2015 సంవత్సరానికి గాను ఐసీసీ అవార్డుల జాబితా:
* ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ (Sir Garfield Sobers Trophy) - Steve Smith (Australia)
* టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Steve Smith (Australia)
* వన్డే క్రికెటర్ ఆప్ ద ఇయర్ - AB de Villiers (South Africa)
* మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Meg Lanning (Australia)
* మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Stafanie Taylor (West Indies)
* టీ20 అత్యుత్తమ ప్రదర్శన - Faf du Plessis (South Africa) (119, 56 balls, 11x4, 5x6 - 2nd T20I Vs West Indies, 11 January 2015, Johannesburg)
* ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Josh Hazlewood (Australia)
* అసోసియేట్/అఫిలియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Khurram Khan (UAE)
* స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు - Brendon McCullum (New Zealand)
* అంఫైర్ ఆఫ్ ద ఇయర్ (David Shepherd Trophy) - Richard Kettleborough (England)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications