ఐసీసీ అవార్డ్స్: టాప్ లేపిన రోహిత్, విరాట్.. ఐసీసీ కెప్టెన్‌గా కోహ్లీ

దుబాయ్: 2019కి గాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ములేపారు. కోహ్లీకి 'స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు, రోహిత్‌కి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులు దక్కాయి.

వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా రోహిత్:
2019లో ఆరు శతకాలు బాదిన 'హిట్‌మ్యాన్'ను 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఐసీసీ ఎంపిక చేసింది. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 శతకాలు బాది సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను అభిమానులు గేలి చేస్తుంటే.. కోహ్లీ అడ్డుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సంజ్ఞలు చేసి క్రీడా స్ఫూర్తి చాటాడు. దీంతో కోహ్లీని 'స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఐసీసీ ప్రకటించింది.

టెస్టు, వన్డే జట్లకు సారథిగా కోహ్లీ
టెస్టు, వన్డే జట్లకు విరాట్ కోహ్లీనే సారథిగా ఐసీసీ ఎంపిక చేసింది. డబుల్ సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్ ఐసీసీ టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. చైనామన్ కుల్‌దీప్ యాదవ్, పేసర్ మొహమ్మద్ షమీ వన్డే జట్టులో ఎంపికయ్యారు. యువ పేసర్ దీపక్ చాహర్ బంగ్లాదేశ్‌తో టీ20లో 6/7తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన '2019 ఐసీసీ పురుషుల టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన'గా ఎంపికైంది.

స్టోక్స్‌కు 'సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్'
ఇంగ్లాండ్ ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు 2019కి 'సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ' దక్కింది. గతేడాది 12 టెస్టుల్లో 59 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ కమిన్స్ '2019 ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్'గా ఎంపికయ్యాడు. ఆసీస్ సంచలనం మార్నస్ లబుషేన్‌కు '2019 వర్ధమాన (ఎమర్జింగ్) క్రికెటర్' పురస్కారం దక్కింది. స్కాట్లాండ్ క్రికెటర్ కైల్ కోయెట్జర్ '2019 అసోసియేట్ క్రికెటర్'గా ఎంపికయ్యాడు. రిచర్డ్ ఇలింగ్‌వర్త్ ఈ ఏడాది అంపైర్‌గా ఎంపికై 'డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీ' సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications