న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.160 కోట్లు కడతారా లేక వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు వదులుకుంటారా!: బీసీసీఐకి ఐసీసీ హెచ్చరిక

ICC asks BCCI to pay Rs 160 crore or lose 2023 World Cup hosting rights, says report

హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఐసీసీ షాకిచ్చింది. పన్ను మినహాయింపు మొత్తం చెల్లింపు విషయంలో బీసీసీఐకి డెడ్‌లైన్ విధించింది. ఈ ఏడాది ముగిసేలోగా రూ.160కోట్లు చెల్లించకపోతే 2021లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2023 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ కోల్పోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.

పీబీఎల్ 2019 షురూ: తొలి మ్యాచ్‌ సింధు Vs మారిన్, ప్రైజ్‌మనీ తదితర వివరాలుపీబీఎల్ 2019 షురూ: తొలి మ్యాచ్‌ సింధు Vs మారిన్, ప్రైజ్‌మనీ తదితర వివరాలు

2016లో భారత్ ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన పన్ను మినహాయింపునకు సంబంధించిన విషయంలో అంతర్జాతీయ క్రికెకట్ కౌన్సిల్ (ఐసీసీ) బీసీసీఐ నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది. 2016లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌కు భారత ప్రభుత్వం నుంచి ఐసీసీ ఎలాంటి పన్ను మినహాయింపు పొందలేదు.

దీంతో ఆ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని బీసీసీఐని ఐసీసీ ఎప్పటి నుంచో కోరుతోంది. బీసీసీఐ మాత్రం దీనిని లైట్‌ తీసుకుంది. బీసీసీఐ రూ.160 కోట్లను గనుక చెల్లించకపోతే.. రెవెన్యూ వాటా కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత బోర్డుకు రావాల్సిన మొత్తం నుంచి ఐసీసీ నేరుగా తీసుకుంటుందని తెలిపింది.

Story first published: Saturday, December 22, 2018, 17:51 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X