For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC annual rankings: టీమిండియా పొజీషన్ ఏంటీ: ఆ మూడు ఫార్మట్లల్లో కింగ్ ఎవరు?

Team India have secured the No.1 position in the annual ICC Men’s T20I Team Rankings released by the ICC.

ముంబై: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా వార్షిక ర్యాంకులను ప్రకటించింది. ఏ ఫార్మట్‌లో.. ఏ జట్టు.. ఏ ర్యాంక్‌లో ఉందో స్పష్టం చేసింది. ప్రత్యేకించి- టెస్ట్ క్రికెట్‌ను ఏలుతున్నదెవరో తేలిపోయింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అగ్రస్థానం ఏ దేశానికి దక్కిందో ఈ ప్రకటనతో వెల్లడైంది. ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్ టీ20 కేటగిరీలో ఏ దేశం ఏ పొజీషన్‌లో ఉందో వివరించింది ఐసీసీ..పాయింట్లతో సహా. ఈ మూడు ఫార్మట్లలోనూ భారత్ తొలి అయిదు స్థానాల్లోనే ఉంది.

దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మే 2019 నుంచి మే 2021 వరకు ఆడిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుంది. టీ20 ఫార్మట్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ కేటగిరిలో తనకు తిరుగులేదనిపించుకుంది రోహిత్ సేన. ఆ రెండు సంవత్సరాల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్‌, శ్రీలంకలను వైట్‌వాష్ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆ స్థాయిలో ఆడలేదు.

అయినప్పటికీ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది టీమిండియా. 270 రేటింగ్ పాయింట్స్‌ను సాధించింది. రెండోస్థానంలో ఇంగ్లాండ్-265, మూడో స్థానంలో పాకిస్తాన్-261 నిలిచాయి. 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా, 251 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి అయిదు స్థానాలో నిలిచాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి టీ20 ఫార్మట్‌లో.టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది.

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్, తదనంతరం పాకిస్తాన్‌పై తిరుగులేని విజయాలను సాధించింది. తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కేటగిరిలో భారత్‌ది రెండో స్థానం. 119 పాయింట్లో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్ కేటగిరీలో తొలి స్థానం- కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌దే. 125 పాయింట్లో అగ్రస్థానానికి ఎగబాకిందీ జట్టు. ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్ ఉన్నాయి.

Story first published: Wednesday, May 4, 2022, 15:20 [IST]
Other articles published on May 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+