న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC 2023-27 FTP : వచ్చే నాలుగేళ్లలో 777 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు.. ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

 ICC Announced 777 International Matches In 2023-27 FTP Cycle, India Will Play..?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023-27 కాలానికి సంబంధించి మెన్స్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)ని విడుదల చేసింది. అన్ని ఫార్మాట్‌లలో 12 సభ్య దేశాల అంతర్జాతీయ క్యాలెండర్‌ను ప్రకటించింది. మొత్తంగా 2023-2027 FTP సైకిల్‌లో 777అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో 173టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు జరగనున్నాయి. ప్రస్తుతం ఎఫ్టీపీ సైకిల్లో 694 మ్యాచ్‌లు మాత్రమే జరగగా.. 2023-27 ఎఫ్టీపీలో 83 మ్యాచ్‌లు అధికంగా జరగనుండడం విశేషం. ఇక భారత్‌లో 2023వన్డే ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముందు ఏకంగా భారత్ 27వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తద్వారా వన్డే ప్రపంచకప్ టైంకు మంచి ప్రాక్టీస్ భారత్‌కు దక్కే వీలుంది. ఇటీవల ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు అధికమైన తరుణంలో ఐసీసీ అంతర్జాతీయ షెడ్యూళ్లు తగ్గిస్తుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టి మరింత ఎక్కువ మ్యాచ్‌లను జరిపేలా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ వెలువరించింది. అన్ని ఫార్మాట్లకు సముచితమైన ప్రాధాన్యం దక్కేలా క్యాలెండర్లో సర్దుబాటు చేసింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండుసార్లు 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లు

భారత్ ఈ సైకిల్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో 5మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. 2027 వరకు భారత్ మొత్తం 44 టెస్టులు, 63 వన్డేలు, 76 టీ20లు ఆడనుంది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ జట్టు అత్యధిక టెస్టులు (22) ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (21), భారత్ (20) ఆడనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో, నాలుగో ఎడిషన్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లను ఆడనున్నాయి. హైలెట్ ఏంటంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య) ఈ ఎఫ్టీపీ సైకిల్లో మూడో, నాలుగో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి.

ఈ నాలుగేళ్లలో అన్ని ప్రధాన ఈవెంట్లు

ఆస్ట్రేలియా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు భారతదేశాన్ని స్వాగతిస్తుంది. 2025-27 డబ్ల్యూటీసీలో ఇండియాకు ఆస్ట్రేలియా టీం వస్తుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు ఢీకొనడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1992లో ఇలా అయిదు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ నాలుగేళ్ల సైకిల్లో వన్డే క్రికెట్ ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతాయి. అలాగే 2 సార్లు పురుషుల టీ20 ప్రపంచకప్‌లు, 2 WTC ఫైనళ్లు జరుగుతాయి.

2027లో వన్డే ప్రపంచకప్ ఎక్కడంటే..?

వెస్టిండీస్, USA 2024లో టీ20 ప్రపంచ‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ తర్వాత 2025లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనుంది. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా 2026లో టీ20 ప్రపంచ‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో వన్డే క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. ICC GM ఆఫ్ క్రికెట్ వసీం ఖాన్ మాట్లాడుతూ.. 'రాబోయే నాలుగు సంవత్సరాలపాటు షెడ్యూల్ వేయడానికి ఈ FTPని రూపొందించడానికి కృషి చేసిన మా సభ్యులకు ధన్యవాదాలు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌లు ఈ ఎఫ్టీపీలో కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉంది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ అభివృద్ధి చెందేలా ఈ ఎఫ్టీపీని రూపొందించాం.' అని ఆయన చెప్పారు.

Story first published: Wednesday, August 17, 2022, 16:40 [IST]
Other articles published on Aug 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X