Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Men's T20 World Cup 2022 : 16 మంది అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. ఎంపికైన ఏకైక భారత అంపైర్

ICC Announced 16 Umpires List For the Upcoming T20 World cup 2022

అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ‌కప్ 2022 కోసం 16మంది అంపైర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న ఏకైక భారతీయుడు నితిన్ మీనన్ సైతం ప్రపంచకప్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇప్పటికే అతను ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్ 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు అంపైర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ నలుగురితో పాటు మొత్తంగా 16మంది అంపైర్లు ఈ టోర్నమెంట్‌కు అధికారిక అంపైర్లుగా వ్యవహరించనున్నారు. గతేడాది టీ20 ప్రపంచ‌కప్ టైటిల్‌ను ఆసీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి స్వదేశంలో ఈ మెగా టోర్నీ జరుగుతుండడంతో టైటిల్ ఫేవరేట్‌గా ఆసీస్ ఉంది.

'ఈ లిస్టు అనుభవశీలురైన అంపైర్లతో కూడుకుని ఉంది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లోను 16మందిని అంపైర్లుగా ఎంపిక చేశాం' అని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల చీఫ్ రిఫరీ.. రంజన్ మదుగల్లె అన్నాడు. టీ20 ప్రపంచ‌కప్ ఎనిమిదో ఎడిషన్‌కు జింబాబ్వేకు చెందిన ఆండ్రూ పైక్రాఫ్ట్, ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్టోఫర్ బ్రాడ్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ బూన్‌, శ్రీలంకకు చెందిన మదుగల్లె మ్యాచ్ రిఫరీలుగా ఉన్నారు.

అక్టోబరు 16న గీలాంగ్‌లో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌ మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. జోయెల్ విల్సన్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. పాల్ రీఫిల్, ఎరాస్మస్‌ టీవీ అంపైర్లుగా వ్యవహరిస్తారు.

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ‌కప్ 2022లో మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె
అంపైర్లు : అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బోర్త్.

Story first published: Wednesday, October 5, 2022, 7:00 [IST]
Other articles published on Oct 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+