Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు షాక్ ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ

భారత్‌ను కవ్వించే‌లా చర్యలు చేపట్టాలనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. బీసీసీఐ, జైషా నిరసనల ఫలితంగా వివాదాస్పద పాక్ అక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన లేకుండా ట్రోఫీ టూర్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. మెగా టోర్నీలో పాల్గొనే ఎనిమిది దేశాల్లో దాదాపు 70 రోజుల పాటు ట్రోఫీ ప్రదర్శన ఉండనుంది. అంతిమంగా భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ చేరనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించమని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. మాజీ, ప్రస్తుత పాక్ క్రికెటర్లు విజ్ఞప్తులు, అభ్యర్థనలకు బీసీసీఐ కరుణించలేదు. ఆసియా కప్ తరహాలోనే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని పేర్కొంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ మెగాటోర్నీలోని భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే జరిగాయి.

ICC Alters Trophy Tour Route Skips POK Stopover in India Scheduled for January

మరోవైపు భారత్‌ను తమ దేశానికి రప్పించాలని ఐసీసీపై పాకిస్థాన్ ఒత్తిడి చేసింది. అయినప్పటికీ బీసీసీఐ పట్టుబట్టడంతో ఐసీసీ కూడా హైబ్రిడ్ మోడల్‌కే సై అనేలా సంకేతాలు జారీచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ను కవ్వించేలా పాకిస్థాన్ పూనుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన చేయాలని నిర్ణయించుకుంది. శనివారం ఇస్లామాబాద్‌ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ ప్రారంభం కానుందని, స్కర్దు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్‌ వంటి ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా ట్రోఫీని ప్రదర్శించనున్నామని పాక్ బోర్డు పేర్కొంది.

స్కర్దు, హుంజా, ముజఫరాబాద్‌ వివాదాస్పద పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాలు. దీనిపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ప్రపంచ వేదికపై మన బలాన్ని చూపడంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ అక్రమిత కశ్మీర్‌లో టోర్నీ ప్రదర్శన చేస్తే ఉపేక్షించమని చెప్పింది. అంతేగాక ట్రోఫీ టూర్ షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించని విషయం తెలిసిందే. కాగా, డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది.

ట్రోఫీ టూర్:
నవంబర్ 16: ఇస్లామాబాద్, పాకిస్థాన్
నవంబర్ 17: తక్షిలా- కాన్పూర్, పాకిస్థాన్
నవంబర్ 18: అబోటాబాద్, పాకిస్థాన్
నవంబర్ 19: ముర్రే, పాకిస్థాన్
నవంబర్ 20: నథియా గలి, పాకిస్థాన్
నవంబర్ 22-25: కరాచీ, పాకిస్థాన్
నవంబర్ 26-28: అఫ్గానిస్థాన్
డిసెంబర్ 10-13: బంగ్లాదేశ్
డిసెంబర్ 15-22: దక్షిణాఫ్రికా
డిసెంబర్ 25- జనవరి 5: ఆస్ట్రేలియా
జనవరి 6-11: న్యూజిలాండ్
జనవరి 12-14: ఇంగ్లండ్
జనవరి 15-26: భారత్
జనవరి 27: పాకిస్థాన్‌లో ఈవెంట్ స్టార్ట్.

Story first published: Saturday, November 16, 2024, 16:56 [IST]
Other articles published on Nov 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+