For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG Vs AFG: భారీ శతకంతో అప్ఘాన్ బ్యాటర్ సంచలనం - ఛాంపియన్స్ ట్రోఫీలోనే రికార్డ్ స్కోర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మ్యాచులో అప్ఘానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ( 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 177;) భారీ శతకంతో సంచలనం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు సాధించింది.

చివరి 9 ఓవర్లలో 108 పరుగులు..
ఈ మ్యాచ్ లో అప్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇందులో 108 పరుగులు చివరి 9 ఓవర్లోనే వచ్చాయి. 42వ ఓవర్ - 10 పరుగులు, 43వ ఓవర్ - 9 పరుగులు, 44వ ఓవర్ - 20 పరుగులు, 45వ ఓవర్ - 10 పరుగులు, 46వ ఓవర్ - 10 పరుగులు, 47వ ఓవర్ - 23 పరుగులు, 48వ ఓవర్ - 10 పరుగులు, 49వ ఓవర్ - 14 పరుగులు, 50వ ఓవర్ - 2 పరుగులు వచ్చాయి.

Ibrahim Zadran record century 177 runs as highest score in champions trophy 2025 eng vs afg

ఛాంపియన్స్ ట్రోఫీలోనే రికార్డ్ స్కోరు..
జద్రాన్ కూడా తన ఇన్నింగ్స్ స్కోర్ తో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ (165) సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..
ఇ‍బ్రహీం జద్రాన్‌ - 177 (ప్రస్తుత సీజన్ లో)
బెన్‌ డకెట్‌ - 165 (ప్రస్తుత సీజన్ లో)
నాథన్‌ ఆస్టల్‌ - 145 నాటౌట్‌
ఆండీ ఫ్లవర్‌ - 145
గంగూలీ - 141 నాటౌట్‌
సచిన్‌ తెందుల్కర్ - 141
గ్రేమీ స్మిత్‌ - 141

రెండు ఐసీసీ ఈవెంట్లలో సెంచరీలు..
రెండు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ సెంచరీలు బాదిన తొలి అప్ఘానిస్థాన్ క్రికెటర్ గా నిలిచాడు ఇబ్రహీం జద్రాన్. గతంలో 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై 129 నాటౌట్ అద్భుత శతకం చేశాడు. ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించాడు.

తన రికార్డ్ తానే బ్రేక్..
వన్డేల్లో ఆఫ్ఘానిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు‌ సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు ఇబ్రహీం జద్రాన్. గతంలోనూ (2022లో) అతడే శ్రీలంకపై ‌ 162 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు.

పాక్ గడ్డపై నాలుగో ఆటగాడిగా..
పాకిస్థాన్ ‌గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ జద్రాన్ దే కావడం విశేషం. ఈ జాబితాలో అగ్రస్థానంలో గ్యారీ కిర​్‌స్టన్‌ ఉన్నాడు.

పాక్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..
గ్యారీ కిర్‌స్టన్‌ - 188 నాటౌట్‌ (1996 ప్రపంచ కప్ లో యూఏఈపై)
వివియన్‌ రిచర్డ్స్‌ - 181
ఫకర్‌ జమాన్‌ - 180 నాటౌట్‌
ఇబ్రహీం జద్రాన్‌ - 177
బెన్‌ డకెట్‌ - 165

Story first published: Wednesday, February 26, 2025, 18:58 [IST]
Other articles published on Feb 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+