Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్ తీరంలో మరో సూపర్‌ స్టార్‌: అయ్యర్‌పై స్మిత్ ప్రశంసల వర్షం

Ian Smith Praises Shreyas Iyer; Calls Him Another Superstar

హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌ శ్రేయర్‌ అయ్యర్‌పై న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ స్మిత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి20లో శ్రేయాస్ అయ్యర్‌ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో అయ్యర్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా మరో ఆరు బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరుగుతున్న సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న ఇయాన్ స్మిత్... అయ్యర్‌ను కొనియాడాడు.

"న్యూజిలాండ్‌ తీరంలోకి మరో సూపర్‌ స్టార్‌ (శ్రేయస్‌ అయ్యర్‌) రావడం మేమంతా చూశాం. గొప్ప ఇన్నింగ్స్‌, టీమిండియా ఛేజింగ్‌ చేసిన తీరు ఎంతోగానే ఆకట్టుకుంది. మనీష్‌ పాండే కూడా తనవంతు పాత్ర పోషించాడు" అని ఇయాన్‌ స్మిత్‌ తెలిపాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు.

"విదేశీ గడ్డపై మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉంది. అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించా. త్వరగా వికెట్లు కోల్పోవడంతో ముందుగా మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాం. ఆక్లాండ్‌ మైదానం చిన్నది కాబట్టి ఎక్కువ పరుగులు సాధించగలమని ముందే తెలుసు. మిగతా మ్యాచ్‌ల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాం" అని చెప్పాడు.

ఆక్లాండ్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో విజయం సాధించడంతో 5 టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, January 25, 2020, 11:10 [IST]
Other articles published on Jan 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+