
అశ్విన్‌కు చోటివ్వాలి:
ఈ ఏడాది జూన్‌లో సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 2016 నుంచి ఆసియా వెలుపల 28.08 సగటుతో అశ్విన్ మిగతా స్విన్నర్ల కంటే ఉత్తమ గణాంకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ సిరీసుకు ముందు ఓవల్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే జట్టు తరఫున ఆడి అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచులో 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ కూడా వేశాడు. దాంతో అశ్విన్ తుసి జట్టులో యాష్ ఆడడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ నాలుగో టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అశ్విన్ జట్టుకు దూరంగా ఉంచడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఓ క్రీడాఛానల్‌కు రాసిన కథనంలో ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్.. రవిచంద్రన్ అశ్విన్ ఎంపికపై స్పందించాడు. 'ఆర్ అశ్విన్ చేరికతో భారత్ అత్యుత్తమ జట్టుగా మారుతుంది. యాష్ అన్ని పరిస్థితుల్లో మేటి బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అది నిరూపించుకున్నాడు. అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి. ఈ విషయంలో సెలెక్టర్లు చొరవ చూపాలి. అశ్విన్‌కు చోటు కల్పించడానికి టీమ్ సెలెక్టర్లు ఓ మార్గాన్ని కనుగొనాలి. అశ్విన్ కోసం మిడిల్ ఆర్డర్‌ని సర్దుబాటు చేయాలి' అని ఇయాన్ ఛాపెల్ సూచించాడు. ఇంగ్లండ్ జట్టుతో ఆడిన నాలుగు టెస్టుల్లో రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడాడు. మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలమవుతుండడంతో బ్యాటింగ్ బలోపేతం కోసం జడేజా వైపే కెప్టెన్ విరాట్ కోహ్లీ మొగ్గుచూపాడు.

రిజర్వ్ బెంచ్ కూడా పటిష్ఠంగా ఉంది:
ప్రస్తుతం టీమిండియా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్ఠంగా ఉందని ఇయాన్ ఛాపెల్ అన్నాడు. 'కోహ్లీసేన అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉంది. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లు గెలవడమే. అంతేకాకుండా ఇంగ్లండ్‌లోనూ ఆధిపత్యం చలాయించింది. ఇక మిడిల్ ఆర్డర్‌లో భారత్.. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌ను కలిగి ఉంటే జట్టు పూర్తిస్థాయిలో బలంగా మారుతుంది. జట్టులో కుడి, ఎడమ కాంబినేషన్ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన ఓవల్ టెస్టులో భారత్ జడేజాను ఐదో స్థానంలో ఆడించింది' అని ఇయాన్ వివరించాడు. నాలుగో టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.

జడేజా నిరూపించుకోకుంటే:
'ఐదో స్థానంలో రవి జడేజా నిరూపించుకోకుంటే.. అప్పుడు జట్టుకు పేస్ బౌలర్ ఆల్‌రౌండర్ అవసరం అవుతుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. లోయర్ ఆర్డర్‌లో ముగ్గురు పేస్ బౌలర్లను వినియోగించుకుంటే జట్టు సమతూకంగా ఉంటుంది' అని ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 10) నుంచి జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. భారత బృందంలో వరుసగా కరోనా కేసులు బయటపడడంతో టెస్ట్ మ్యాచ్ రద్దయింది. దాంతో ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ 2021 కోసం దుబాయ్ వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications












