For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాపెల్.. ఈ నిర్ణయానికి కారణమేంటంటే..?

Ian Chappell Says Good Bye to 45-year commentary career

ఆస్ట్రేలియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్, ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ ఇయాన్ చాపెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 45 ఏళ్లుగా ఎన్నో మ్యాచులకు కామెంటరీ సేవలందించిన ఆయన కామెంటరీ కెరీర్‌కు ఇక సెలవు ప్రకటించాడు. ఇక ఇయాన్ చాపెల్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఆల్ టైం అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడనే విషయం తెలిసిందే. అతన్ని ఇటీవల సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌ అనే ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో అతను కామెంటరీకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. చాపెల్ 75 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ఆడాడు. 30మ్యాచ్‌లకు ఆ జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 1977లో ముగిసింది. అప్పుడు కామెంటేటర్‌గా తన కెరీర్‌ మొదలెట్టిన చాపెల్ సుమారు 45ఏళ్ల పాటు కామెంటరీ ప్యానెల్లో ఎన్నో మంచి విశ్లేషణలతో కూడిన కామెంట్రీ అందించాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కామెంటేటర్‌గా వెలుగొందాడు.

ఇక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చాపెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా క్రికెట్ కెరీర్ ముగిసిన రోజు ఇప్పటకీ నా కళ్లల్లో మెదలాడుతుంది. ఆ రోజు పదే పదే వాచ్ చూస్తూ గడిపాను. టైమ్‌ 11 దాటాక ఇక నా కెరీర్ ముగిసిందనే నిశ్చయానికొచ్చాను. కామెంట్రీ పరంగా కూడా ఇన్నేళ్ల పాటు సేవలందించడం ఒకింత సంతోషంగా ఉన్నా.. రిటైర్ కావాల్సిన టైమొచ్చింది. కొన్నేళ్ల కిందట హార్ట్ ఎటాక్ వచ్చినప్పటి నుంచి నా ఆరోగ్య పరిస్థితి మునుపటిలా ఉండడం లేదు. అదృష్టవశాత్తూ నేను హార్ట్ ఎటాక్ నుంచి బతికి బట్టకట్టగలిగాను కానీ.. ఇంకా నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే రిటైర్ అవుతున్నా అని చాపెల్ చెప్పాడు.

Story first published: Monday, August 15, 2022, 17:54 [IST]
Other articles published on Aug 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+