
మిగతా క్రికెట్ దేశాలు అసూయ పడుతున్నాయి
ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టీమిండియా విజయాలను చూసి మిగతా క్రికెట్ దేశాలు అసూయ పడుతున్నాయి. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అందుకొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలని తపించే దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. దీంతో టెస్ట్ క్రికెట్ మరింత బలోపేతమవుతుంది' అని అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ మేలు చేస్తోంది
'భవిష్యత్‌లో టెస్ట్ క్రికెట్ బతికి ఉండాలంటే ఆటలో ప్రమాణాలు పెరగాలి. భారత్‌లో క్రికెట్ ప్రమాణాలు అమోఘం. భారత్‌లో ప్రతిభావంతులకు కొదవలేదు, అపార ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇక ఐపీఎల్ కూడా ఉండడం మేలు చేస్తోంది. అత్యున్నత శిఖరాలు చేరేందుకు భారత్ అనుసరిస్తున్న విధానాలను క్రికెట్‌లో బలమైన జట్టుగా మారాలని భావించే దేశాలు అనుసరించాలి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు బలంగా ఉన్నాయి' అని చాపెల్ పేర్కొన్నారు. అయితే దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి ఇతర టెస్ట్ ఆడే దేశాల క్షీణతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత బౌలింగ్ అద్భుతం
'ప్రస్తుత భారత బౌలింగ్ అద్భుతంగా ఉంది. పేస్, స్పిన్ రెండు విభాగాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేష్ బాగా రాణిస్తున్నారు. అశ్విన్, జడేజాలు వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ బౌలింగ్ దాడి ఇతర దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. భారత పేసర్లు ఎక్కడైనా రాణించగలరు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఐపీఎల్ ద్వారా యువ ఆటగాళ్లు సీనియర్ల నుండి ఎంతో నేర్చుకుంటున్నారు' అని చాపెల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












