For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'డేవిడ్ వార్నర్‌ను దాడి చేసే కుక్కలా తయారు చేసింది వాళ్లే'

By Nageshwara Rao
Ian Chappell reacts to the David Warner-Quinton de Kock furore

హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా సాధించిన విజయం కంటే కూడా డేవిడ్ వార్నర్-క్వింటన్ డీకాక్‌ల మధ్య చోటు చేసుకున్న వివాదమే హైలెట్‌గా నిలిచింది. ఈ గొడవపై ఇప్పటికే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, కోచ్ డారెన్ లీమన్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు స్పందించిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను విన్నాను (స్లెడ్జింగ్) అనేది ఆటలో భాగమేనని --- ఇది అసంబద్ధమైనది, ఇది ఆటలో ఎంత మాత్రం భాగం కాదు" అని ఓ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఛాపెల్ వ్యాఖ్యానించాడు.

"దీంతో స్లెడ్జింగ్ చేయాలని వార్నర్ నిర్ణయించుకున్నాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. నిజానికి అతడు దాడి చేసే కుక్క కావాలని అనుకోలేదు. అయితే కొన్ని కారణాల వల్ల అతడు దాడి చేసే కుక్క లాగా తయారయ్యాడు" అని ఛాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్‌గా, జట్టులో సీనియర్ ఆటగాడిగా డర్బన్ వేదికగా జరిగిన టెస్టులో వార్నర్ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని ఛాపెల్ అన్నాడు. ఈ మధ్య కాలంలో వార్నర్ గురించి జట్టు సహచరులు 'ది బుల్ ఈజ్ బ్యాక్' అనే మాట చెప్పగా విన్నానని, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లపైకి వార్నర్‌ను స్లెడ్జింగ్ పేరిట ఉసిగొలుపుతున్నారు.

దీనికి కోచ్, జట్టు మేనేజ్‌మెంట్ మద్దతు ఉండటంతో పరిస్థితి ఈరోజు ఇంతటి వరకు వచ్చిందని తెలిపాడు. క్రికెట్‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నాడు. "క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సందర్లాండ్ మాట్లాడుతూ స్లెడ్జింగ్‌ అనేది ఆటలో భాగమని చెప్పాడు. కోచ్‌ను కూడా అతడే నియమిస్తాడు, స్లెడ్జింగ్‌ను ప్రోత్సహించడంతో మైదానంలో ఆటగాళ్లు మరింత వ్యక్తిగతంగా వెళుతున్నారు" అని అన్నాడు.

"ప్రస్తుత ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్‌కు మంచి ప్లేయర్‌గా ట్రాక్ రికార్డు లేదు. ఇక, స్లెడ్జింగ్ విషయానికి వస్తే ఆటగాళ్లను అతడే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అతడికి వత్తాసు పలుకుతుంది. 'విను, డారెన్ లీమన్, స్లెడ్జింగ్‌ అనేది ఆటలో భాగం కాదు'" అని ఛాపెల్ పేర్కొన్నాడు.

డర్బన్ టెస్టులో అసలేం జరిగింది?
తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజైన ఆదివారం మర్క్రమ్, డీకాక్‌లు క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన సమయంలో డీకాక్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వార్నర్ స్లెడ్జింగ్ చేశాడు. ఇందులో భాగంగా డీకాక్ కుటుంబాన్ని వార్నర్ "Bush Pig" అన్నట్లు దక్షిణాఫ్రికా స్థానిక మీడియా పేర్కొంది.

దీనిని ఎంతమాత్రం తట్టుకోలేని డీకాక్ టీ విరామ సమయం మైదానం నుంచి బయటకు వచ్చే సమయంలో వార్నర్ భార్య గురించి "f***ing sook" అని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ పేర్కొంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు మెట్ల వద్ద వార్నర్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు.

సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో బయటకు రావడంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. మరోవైపు వార్నర్-డీకాక్‌లు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు మ్యాచ్ అంఫైర్లు ఐసీసీకి నివేదించారు.

ఈ నివేదికలో డేవిడ్ వార్నర్ లెవెల్ 2 నేరానికి పాల్పడగా... డీకాక్ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. దీంతో వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఒక్క మ్యాచ్‌ నిషేధం పడనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తొలి టెస్టులో డేవిడ్‌ వార్నర్‌- డికాక్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

వీడియో ఫుటేజీలో సహచర క్రికెటర్లు వార్నర్... డికాక్‌పైకి దూసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఐసీసీ విచారణలో 'గేమ్‌ ఆఫ్‌ డిస్ప్యూట్‌' కింద వార్నర్‌ ఐసీసీ లెవల్‌-2 నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఇదే చెబితే అతని ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు చేరతాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఉంటే అతడిపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధిస్తారు. దీంతో పాటు మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తారు. దీని ప్రకారం వార్నర్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

Story first published: Wednesday, March 7, 2018, 17:36 [IST]
Other articles published on Mar 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+