Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : అలా బౌలింగ్ చేస్తారా? అంటూ.. భారత బౌలర్లపై మండిపడిన ఆసీస్ దిగ్గజం!

Ian Chappell not happy with India bowling in fourth test

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా నూట యాభైపైగా పరుగులతో ఆ జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 14వ టెస్టు శతకం సాధించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఖవాజా.. భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు. భారీ షాట్లతో రెచ్చిపోలేదు కానీ.. అసలు సిసలు టెస్టు ఆటతో ఆకట్టుకున్నాడు.

ఖవాజా సూపర్..

ఖవాజా సూపర్..

ఈ క్రమంలో ఖవాజా బ్యాటింగ్‌ను ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ ఇయాన్ ఛాపెల్ తెగ మెచ్చుకున్నాడు. ఖవాజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. తన బ్యాటింగ్‌కు కామ్‌నెస్, నిలకడను జత చేసిన ఖవాజా అద్భుతంగా ఆడాడని చెప్పాడు.

ఈ టెస్టు సిరీస్ మొత్తం ఖవాజా బాగానే రాణిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీ పూర్తి చేసుకున్న ఖవాజా.. ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. అతనికి యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా తోడవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

టీమిండియా బౌలింగ్ ప్లాన్?

టీమిండియా బౌలింగ్ ప్లాన్?

అయితే భారత బౌలింగ్ వ్యూహాలపై మాత్రం ఛాపెల్ మండిపడ్డాడు. అసలు భారత్ ఏ ప్లాన్‌తో బౌలింగ్ వేస్తుందో తనకు అర్థం కావడం లేదని, ముఖ్యంగా ఖవాజాకు ఎలా బౌలింగ్ వేయాలో కూడా భారత్‌కు తెలియడం లేదని విమర్శించాడు.

'భారత బౌలర్లలో ఎవరూ కూడా అరౌండ్ ది వికెట్ వచ్చే ఆలోచనే చేయకపోవడం నాకు అర్థం కావడం లేదు. ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తుంటే కనీసం ఆ ఆలోచన చేయకపోవడం ఏంటి? అసలు ఈ బౌలింగ్ ప్లాన్ నాకు ఏం అర్థం కావడం లేదు' అని ఛాపెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ మాత్రం తెలియదా?

ఆ మాత్రం తెలియదా?

ప్రపంచ క్రికెట్‌లో ఎవరిని అడిగినా సరే.. లెఫ్ట్ హ్యాండర్ ఆడుతుంటే కుడిచేతి వాటం బౌలర్లు అరౌండ్ ది వికెట్ బౌలింగ్ చేస్తే ఆడటం కష్టమనే చెప్తారని ఛాపెల్ తేల్చిచెప్పాడు. కానీ భారత్ మాత్రం ఆ వ్యూహాన్ని అసలు ఉపయోగించకపోవడం ఏంటని ప్రశ్నించాడు. కనీసం అప్పుడప్పుడు అయినా అరౌండ్ ది వికెట్ బౌలింగ్ వేస్తే బాగుండేదని ఛాపెల్ చెప్పాడు.

ఈ క్రమంలో భారత బౌలర్లను విమర్శించడంలో ఛాపెల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అసలు భారత బౌలింగ్ యూనిట్ ఆలోచనా తీరే బాగలేదని తిట్టేశాడు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు బౌలింగ్ వేయడంలో భారత బౌలర్ల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు.

Story first published: Friday, March 10, 2023, 13:05 [IST]
Other articles published on Mar 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+