స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్‌ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్‌ చాపెల్‌

Ind vs Aus 4th Test : Rohit Sharma Emulating Steve Smith With Shadow Practise In Brisbane Test

సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ స్థానంలో మరొకరు దొరక్కపోతే.. స్టీవ్‌ స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ.. స్మిత్ వైపే మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు. స్మిత్‌తో పాటు స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ కూడా రేసులో ముందున్నాడని ఛాపెల్‌ పేర్కొన్నాడు. సొంతగడ్డపై భారత్‌ చేతిలో 1-2తో ఆసీస్‌ టెస్టు సిరీస్‌ ఓడాక కెప్టెన్సీ నుంచి పైన్‌కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇంకొకరు దొరక్కపోతే:

ఇంకొకరు దొరక్కపోతే:

టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీపింగ్‌, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడంతో టీమ్ పైన్‌ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇయాన్‌ ఛాపెల్‌ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాల్‌ ట్యాంపరింగ్‌కు సూత్రధారి అయిన ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఉందని, అందుకే ఉన్న ఒక్క ఆప్షన్‌ స్టీవ్ స్మిత్‌ అని స్పష్టం చేశాడు. 'అవును, బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా' అని ఛాపెల్‌ అన్నాడు.

వార్నర్‌ కన్నా.. స్మిత్‌ పెద్ద నేరస్థుడు:

వార్నర్‌ కన్నా.. స్మిత్‌ పెద్ద నేరస్థుడు:

అయితే నాయకత్వానికి స్టీవ్ స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఇయాన్‌ ఛాపెల్‌ ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దదని పేర్కొన్నాడు. 'స్మిత్‌, వార్నర్‌ ఒకే విభాగం కిందకు ఎందుకు రావడం లేదు?. నాయకత్వంపై స్మిత్‌కు రెండేళ్ల నిషేధం ఉంటే.. వార్నర్‌కూ అంతే శిక్ష ఎందుకు లేదు?. సారథ్యంపై వార్నర్‌కు జీవితకాల నిషేధం విధిస్తే.. స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?. నా దృష్టిలో వార్నర్‌ కన్నా.. స్మిత్‌ పెద్ద నేరస్థుడు' అని ఇయాన్‌ ఛాపెల్‌ ప్రశ్నించారు.

ప్రధాన సూత్రధారి వార్నర్:

ప్రధాన సూత్రధారి వార్నర్:

దక్షిణాఫ్రికాపై 2018లో డేవిడ్ వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ పథకం వేయగా.. స్టీవ్ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఇందుకు సహకరించారని ఆసీస్‌ విచారణలో తేలిన సంగతి తెలిసిందే. అప్పట్లో బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం వెలుగులోకి రాగా.. దీని సూత్రధారి మాత్రం వార్నర్. అయితే ట్యాంపరింగ్ ప్లాన్ గురించి స్మిత్‌కు పూర్తిగా తెలీదని క్రికెట్ ఆస్ట్రేలియా అంతర్గత విచారణలో తేలింది. దీంతో స్మిత్‌పై రెండేళ్ల కెప్టెన్సీ నిషేధం, వార్నర్‌కు జీవితకాల నిషేధం విధించారు.

పైన్‌ వికెట్‌ కీపింగ్‌ దారుణం:

పైన్‌ వికెట్‌ కీపింగ్‌ దారుణం:

ఆస్ట్రేలియా జట్టులో నిబద్ధత లోపించిందని మాజీ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ విమర్శించాడు. కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా టీమ్ పైన్‌ విఫలమయ్యాడన్నాడు. 'ఆస్ట్రేలియా నిజమైన నిబద్ధత లేకుండా ఆడింది. ఏ దశలోనూ వాళ్లు పోటీలో ఉన్నట్లు కనిపించలేదు. 60 పరుగులను 130గా మార్చాలనే ఆకలి వాళ్లలో లేదు. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌, కోచ్‌, సహాయ సిబ్బంది నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు. మా ఫీల్డింగ్‌పై అసలు నమ్మకమే లేకుండా పోయింది. ఫీల్డింగ్‌తో పాటు వ్యక్తిత్వంపై దృష్టి సారిస్తే జట్టు మునుపటిలా మారుతుంది. సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో పైన్‌ ప్రదర్శన చూశాక.. అతను పూర్తిస్థాయిలో సాధన చేశాడనిపించలేదు. లైయన్‌ బౌలింగ్‌లో అతని వికెట్‌ కీపింగ్‌ దారుణం. కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో రాణించేందుకూ ప్రయత్నించలేదు' అని మండిపడ్డాడు.

'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్‌ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 22, 2021, 9:34 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X