ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనత సాధించలేదు.. అశ్విన్ అత్యుత్తమ బౌలర్ కాదు! మంజ్రేకర్‌పై మండిపడ్డ ఛాపెల్!

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. అశ్విన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా పరిగణించలేమని వివాస్పద కామెంటేటర్ మంజ్రేకర్ అన్నప్పుడు.. జోయల్ గార్నర్ గురించి ప్రస్తావించాడు ఛాపెల్. ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్ ఒకడని ఛాపెల్ అన్నాడు. అశ్విన్ టీమిండియాకు ప్రధాన బౌలర్ అని తెలియడం వల్ల ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటారని ఆస్ట్రేలియా దిగ్గజం పేర్కొన్నాడు.

అశ్విన్ అత్యుత్తమ బౌలర్ కాదు:
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'ఆర్ అశ్విన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారి కూడా 5 వికెట్ల ఘనత సాధించలేదు. సొంతగడ్డపై తనకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా గత నాలుగేళ్లుగా వికెట్ల వేటలో రవీంద్ర జడేజా అతడితో పోటీపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో స్పిన్ పిచ్‌లపై అక్షర్ పటేల్ అతడికన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ను నిజమైన ఆల్‌టైమ్ గ్రేట్‌గా పరిగణించడంలో ఇవే నా సమస్యలు' అని అన్నాడు.

గార్నర్ ఎన్నిసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు:
సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయంతో ఇయాన్ ఛాపెల్ ఏకీభవించలేదు. 'జోయల్ గార్నర్ ఎన్నిసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు?. మంచి రికార్డున్నా.. ఎక్కువసార్లు అతడు 5 వికెట్లు పడగొట్టలేదు. ఎందుకంటే అతడు మరో ముగ్గురు అత్యుత్తమ బౌలర్లతో కలిసి బౌలింగ్ చేశాడు. కొన్నేళ్లుగా భారత బౌలింగ్ బలంగా ఉంది. బౌలర్లు ఎక్కువసార్లు వికెట్లు పంచుకుంటున్నారు. ఆర్ అశ్విన్ ప్రధాన బౌలర్ అని తెలియడం వల్ల ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అతడిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటారు. అక్షర్ పటేల్ గురించి వాళ్లకెలాంటి అవగాహనా లేదు. అందుకే అతడికి వికెట్లు ఇచ్చుకున్నారు' అని ఛాపెల్ వివరించాడు.

లియాన్ కంటే అశ్విన్ మంచి బౌలర్:
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కంటే రవిచంద్రన్ అశ్విన్ మంచి బౌలర్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నాడు. 'నాథన్ లియాన్ కంటే ఆర్ అశ్విన్ మంచి బౌలర్ అని నా అభిప్రాయం. లియాన్ స్ట్రైక్ రేటును చూడండి మీకే అర్ధం అవుతుంది. అశ్విన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆన్‌సైడ్లో ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. లియాన్ మంచి బౌలర్ అని ఒప్పుకుంటా. కానీ అశ్విన్ అంతకంటే మంచి బౌలర్ అని నేను అనుకుంటున్నా' అని ఛాపెల్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ 78 టెస్టుల్లో 409 వికెట్లు పడగొట్టాడు. లియాన్ 100 టెస్టుల్లో 399 వికెట్లు తీశాడు.

ముగ్గురు భారత బౌలర్లకు చోటు:
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ ఆధునిక యుగంలో టాప్-5 ఉత్తమ టెస్ట్ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. టాప్-5లో ముగ్గురు భారత బౌలర్లను ఛాపెల్ ఎంచుకున్నాడు. రవి అశ్విన్, మహ్మద్ షమీ, కగిసో రబాడా, ఇషాంత్ శర్మ మరియు పాట్ కమిన్స్‌లకు చోటు ఇచ్చాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన కమ్మిన్స్‌ను టాప్ బౌలర్‌గా ఎంచుకున్నాడు. 14 మ్యాచులలో కమిన్స్ 70 వికెట్లు పడగొట్టాడు. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications