మళ్లీ అతనికి కెప్టెన్సీ వద్దంటే వద్దు

Posted By:
 Ian Chappell believes Steve Smith will not captain national team ever again

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ విషయంలో స్మిత్ పై వ్యక్తిగత దూషణలు ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై మీడియా సమావేశంలో పాల్గొన్న చాపెల్ ఇలా మాట్లాడాడు. జట్టును గెలిపించేందుకు అతను ఎంచుకున్న తప్పుదారి ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును ఎంతో అవమానాల పాలు చేసిందంటూ మండిపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్ వార్నర్ కెప్టెన్ కాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుందో అలానే స్మిత్‌పై కూడా అవే తరహాలో చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు.

ఇక ఆసీస్‌ జట్టుకు స్మిత్‌ను కెప్టెన్‌గా చూడాలని తాను అనుకోవడం లేదని ఇయాన్‌ చాపెల్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాంటి వాటికి పాల్పడడంలో ఇంతకుముందు కూడా అనుభవం ఉండటంతో స్మిత్ జట్టుకు కెప్టెన్‌గా ఉండడానికి సరిపోడని అభిప్రాయపడ్డాడు.

'స్మిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చూడాలని అనుకోవడం లేదు. ఒక కెప్టెన్‌ అయిన వ్యక్తి ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ స్మిత్‌ అలా చేయలేదు. కెప్టెన్‌గా సహచరులు గౌరవం ఇవ్వాలి. అటువంటిది స్మిత్‌ పూర్తిగా గౌరవం కోల్పోయాడు. దాంతో అతనికి శాశ్వతంగా కెప్టెన్‌గా నిషేదించడమే సరైంది. ఆ మేరకు సీఏ చర్యలు తీసుకోవాలి. వార‍్నర్‌ను కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో అదే నిబంధనను స్మిత్‌కు కూడా వర్తింపజేయాలి' అని చాపెల్‌ పేర్కొన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 12:49 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి