Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ian Chappel: 'టెస్ట్ ఫార్మాట్‌ను కాపాడాలనుకుంటే.. విరాట్‌ కోహ్లీని ప్రతినిధిగా చేయండి'

Ian Chappel wants Test cricket alive, Players need to appoint Virat Kohli as their spokesperson

సిడ్నీ: టెస్టు క్రికెట్‌పై నిజమైన విశ్వాసం ఉంటే.. ఈ ఫార్మాట్‌ను కాపాడాలనుకుంటే ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లంతా కలిసి ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని.. ఇందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ప్రతినిధిగా ఎంచుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అన్నాడు. కింద స్థాయి నుంచి నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు కొన్ని స్పెల్స్‌ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడగలరా? అని ప్రశ్నించాడు. ఇయాన్‌ చాపెల్‌ ఆసీస్ తరఫున 75 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు.

తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ మాట్లాడుతూ... 'ప్రస్తుతం ఉన్న స్థితిలో టెస్టు స్థాయిలో రాణించాలంటే యువ ఆటగాళ్లకు ఆరంభంలోనే పునాది పడాలి. వాళ్లు ఈ ఫార్మాట్లో నెమ్మదిగా ఎదగాలి. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి. అప్పుడే టెస్టు క్రికెట్‌ మళ్లీ కళకళలాడుతుంది. ఇలా జరగాలంటే ప్రపంచంలోని స్టార్‌ క్రికెటర్లంతా సమావేశం కావాలి. ఇందుకోసం టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని తమ ప్రతినిధిగా నియమించుకోవాలి. యువ ఆటగాళ్లకు ఆరంభం నుంచే నైపుణ్యాలపై దృష్టి ఉంటే వారు ఎలాంటి ఫార్మాట్‌కైనా అలవాటు పడతారు' అని అన్నాడు.

Ian Chappel wants Test cricket alive, Players need to appoint Virat Kohli as their spokesperson

'పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలంటే దశాబ్దాలుగా ఒక్కటే మార్గం ఉంది. అదే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం. అయితే ప్రస్తుతం ఉన్న టీ20 యుగంలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కింద స్థాయి నుంచి నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావట్లేదు. బంతిని ఎంత బలంగా బాదగలరో అంచనా వేయగలుగుతున్నారు కానీ కొన్ని స్పెల్స్‌ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడగలరా అని ఆలోచించట్లేదు. ఇదే సూత్రం ఫీల్డింగ్‌కు కూడా వర్తిస్తుంది. ఫీల్డింగ్‌ చాలా మెరుగైందని అంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా దేశాలు స్లిప్‌ క్యాచింగ్‌లో చాలా బలహీనంగా ఉన్నాయి' అని ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కంటే రవిచంద్రన్‌ అశ్విన్ మంచి బౌలర్ అని ఇయాన్‌ ఛాపెల్‌ చెప్పాడు. 'నాథన్ లియాన్ కంటే ఆర్ అశ్విన్ మంచి బౌలర్ అని నా అభిప్రాయం. లియాన్ స్ట్రైక్ రేటును చూడండి మీకే అర్ధం అవుతుంది. అశ్విన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆన్‌సైడ్లో ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. లియాన్ మంచి బౌలర్ అని ఒప్పుకుంటా. కానీ అశ్విన్ అంతకంటే మంచి బౌలర్ అని నేను అనుకుంటున్నా' అని ఛాపెల్‌ చెప్పుకొచ్చాడు. అశ్విన్ 79 టెస్టుల్లో 413 వికెట్లు పడగొట్టాడు. లియాన్ 100 టెస్టుల్లో 399 వికెట్లు తీశాడు.

Story first published: Monday, August 16, 2021, 14:21 [IST]
Other articles published on Aug 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+