Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా నుంచి నలుగురు: బిషప్‌ ఆల్‌టైమ్‌ వన్డే జట్టిదే

Ian Bishop surprises by picking 4 Indians and only 1 Australian in his all-time ODI XI

హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ తన ఆల్‌టైమ్‌ వన్డే ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. బిషప్ ప్రకటించిన జట్టులో నలుగురు భారతీయలకు చోటు కల్పించాడు. ఓపెనర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌కు జోడిగా రోహిత్‌ శర్మను ఎంపిక చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇక, విండిస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌ను మూడో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశాడు. నాలుగో స్థానానికి టీమీండియా ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కేటాయించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌కు ఐదో స్థానాన్ని కట్టబెట్టాడు. ఐదో స్థానానికి ఏబీని ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా ఇయాన్ బిషప్ వెల్లడించాడు.

ఎక్కువ మ్యాచ్‌లు ఆడి 50కిపైగా యావరేజిని నమోదు చేసిన ఏకైక ఆటగాడు ఏబీ డివిలియర్స్ మాత్రమేనని గుర్తుచేశాడు. ఆరో స్థానానికి కపిల్‌దేవ్‌, ఇయాన్‌ బోథమ్‌, జాక్వెలిస్‌ కల్లిస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ లాంటి దిగ్గజ క్రికెటర్లను కాదని దక్షిణాఫ్రికాకు చెందిన లాన్స్‌ క్లుసెనర్‌‌ని ఎంపిక చేశాడు. వికెట్‌ కీపర్‌గా ధోనీని తీసుకున్నాడు.

ఆస్ట్రేలియా నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌‌ను మాత్రమే ఎంపిక చేశాడు. ఇక, పాకిస్థాన్ నుంచి వసిమ్ అక్రమ్, సక్లెయిన్‌ ముస్తాక్‌‌లకు చోటు కల్పించాడు.

బిషప్‌ ఆల్‌టైమ్‌ వన్డే జట్టు ఇదే:
సచిన్‌ టెండ్కూలర్‌, రోహిత్‌ శర్మ, వివ్ రిచర్డ్స్‌, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, లాన్స్‌ క్లుసెనర్‌, మహేంద్ర సింగ్ ధోని, వసిమ్ అక్రమ్, సక్లెయిన్‌ ముస్తాక్‌, జోయల్‌ గార్నర్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

Story first published: Saturday, June 8, 2019, 16:43 [IST]
Other articles published on Jun 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+