'ఎంఎస్ ధోనీ ఓ సుప్రీమ్.. మహీకి ఎవరూ సాటిరారు'

హైదరాబాద్: ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. క్రికెట్ దిగ్గజాలు మహీ ఆట, కెప్టెన్సీలను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ఓ వీడియోలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టామ్ మూడీ, వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్, భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. ఎంఎస్ ధోనీ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ధోనీ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆటగాళ్లలో ఒకడని ప్రశంసించారు.

మహీకి ఎవరూ సాటిరారు:
భారత ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీకి ఉండే ప్రశాంత స్వభావాన్ని నేను ఆస్వాదించాను. అతడిలో ఎపుడూ ఎలాంటి కోపతాపాలు చూడలేదు. ఆటగాళ్లు తప్పులు చేసినా, బౌలర్ భారీగా పరుగులిచ్చినా ఒకేవిధంగా ఉంటాడు. అలా సహనంగా ఉండడం చాలా కష్టం. టీమిండియా మహీ సారథ్యంలో అద్భుతంగా ముందుకు నడిచింది. టెస్టు కెప్టెన్‌గా నన్నెంతో ఆకట్టుకున్నాడు. అలాగే వన్డే క్రికెట్‌లో 'సుప్రీమ్'గా ఎదిగాడు. వన్డే ఫార్మాట్లో మహీకి ఎవరూ సాటిరారు' అని అన్నారు.

ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడు:
'ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అందుకు కారణం ఒక్కటే.. ఒత్తిడి సమయాల్లోనూ అతడు ప్రశాంతంగా ఉండడమే. అదే లక్షణం తన జట్టుకు అలవాటు చేశాడు. దాంతో క్రికెట్‌ను ఎలా ఆడాలో భారత ఆటగాళ్లు అలాగే ఆడుతున్నారు. టెక్నిక్‌లో అతడో బ్రిలియంట్. తన నిర్ణయాల పట్ల కచ్చితంగా ఉంటాడు. ఆ విషయంలో ఆటకన్నా రెండింతల ముందే ఉంటాడు. ఒక కెప్టెన్‌గా ఆటగాళ్లని సహజసిద్ధంగా ఆడమని ప్రోత్సహిస్తాడు. నాయకత్వ లక్షణాల్లో అదే గొప్ప విషయం' అని టామ్ మూడీ తెలిపారు.

కంప్యూటర్ వంటి క్రికెట్ బ్రెయిన్:
'టీమిండియాలోని ప్రతీ ఆటగాడికీ ఎంఎస్ ధోనీ ఒక నాయకుడు. ఆదేశించే స్థాయిలో ఉన్నా.. ఎంతో వినమ్రంగా ఉంటాడు. తన సారథ్యంలో ఆడేవారితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. అతడిలో ఉండే ఆత్మవిశ్వాసం, నమ్మకం బయటకు కనిపించవు. అలా కెప్టెన్సీ అధికారాన్ని పక్కకు పెట్టేయడం చాలా మంచి విషయం. ఆ విషయంలో చరిత్ర ఎప్పటికీ అతడిని గుర్తుంచుకుంటుంది. ఆటలో అతడిది కంప్యూటర్ వంటి క్రికెట్ బ్రెయిన్. మహీ తీసుకునే నిర్ణయాలే అందుకు ఉదాహరణ. ఒక నాయకుడిగా భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనే అద్భుతమైన ఆటగాడిగా నిలిచిపోతాడు' అని ఇయాన్ బిషప్ చెప్పుకొచ్చారు.

వన్డేల్లో 10,773 రన్స్:
అంతర్జాతీయ కెరీర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశారు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదారు.
IPL 2020: డాడీ.. ఎవరినీ ముట్టుకోవద్దు, ఎవరికీ ముద్దివ్వొద్దు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications