For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsSL: నా ఆట చూడలేదు కదా.. సూర్యపై జోకులు పేల్చిన ద్రావిడ్

Iam sure you did not see me playing Rahul Dravid teases Suryakumar Yadav

టీమిండియా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెగ జోకులు పేల్చాడు. శ్రీలంకపై అతను సూపర్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో అతనితో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ముచ్చటించాడు. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ తన టీ20 కెరీర్‌లో మూడు సెంచరీలు సాధించాడు. వీటిని గుర్తు చేసుకున్న ద్రావిడ్.. ఈ ఇన్నింగ్స్‌లు చూసినప్పుడు ఇంత కన్నా గొప్ప టీ20 ఇన్నింగ్స్ మళ్లీ చూడలేనని అనుకున్నానని, కానీ సూర్య తనకు మరో కొత్త ఇన్నింగ్స్ చూపిస్తూనే వచ్చాడని అన్నాడు.

నా ఆట చూసి ఉండవులే..

నా ఆట చూసి ఉండవులే..

మైదానం నలుమూలలా షాట్లు ఆడే సూర్య.. ఇండియా ఎ తరఫున ఆడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ జట్టు కోచ్‌గా కూడా ద్రావిడే సేవలు అందించాడు. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్ చేరిన తర్వాతనే సూర్య తన విధ్వంసం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతన్ని తెగ మెచ్చుకున్న ద్రావిడ్.. 'నువ్వు చిన్నతనంలో నేను ఆడటం చూసి ఉండవు. కచ్చితంగా చూసి ఉండవు. లేదంటే ఇలా ఆడవు' అన్నాడు. ఆ మాట విన్న సూర్య తెగ నవ్వేశాడు. భారత క్రికెట్‌లో 'ది వాల్' అని పేరొందిన ద్రావిడ్.. సంప్రదాయబద్ధమైన క్రికెట్ షాట్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా డిఫెన్స్ మీదనే ద్రావిడ్ ఫోకస్ ఉండేది.

ప్రతిసారీ ఒక కొత్త ఇన్నింగ్స్

ప్రతిసారీ ఒక కొత్త ఇన్నింగ్స్

అదే సమయంలో సూర్య తనకంటూ ప్రత్యేకమైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. అలాంటి ఆట ఆడే వాడు తన డిఫెన్సివ్ ఆట చూసి ఉండడని ద్రావిడ్ అనడంలో తప్పేం లేదు. అయితే ఈ మాటకు నవ్వినప్పటికీ తను చిన్నతనంలో ద్రావిడ్ ఆట చూస్తూనే పెరిగానని సూర్య చెప్పాడు. 'ఇంట్లో చిన్న పిల్లాడిని పెంచుకుంటున్న వాడు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. సూర్య.. నువ్వు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నావ్. ఇంత కన్నా గొప్ప టీ20 ఇన్నింగ్స్ చూడలేను అనుకున్న ప్రతిసారీ నాకు ఒక కొత్త ఇన్నింగ్స్ చూపిస్తూనే ఉన్నావ్' అని ద్రావిడ్ మెచ్చుకున్నాడు.

గతేడాది చేసిందే చేస్తున్నా..

గతేడాది చేసిందే చేస్తున్నా..

ఇప్పటి వరకు బాదిన మూడు టీ20 సెంచరీల్లో బెస్ట్ ఏదని ద్రావిడ్ ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన సూర్య.. 'పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు ఆడటాన్ని నేను బాగా ఎంజాయ్ చేశా. ఏదో ఒక ఇన్నింగ్స్‌ను ఎంపిక చేయలేను. నా ఆటను ఎంజాయ్ చేశానంతే. గతేడాది ఏం చేశానో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నా. ఇంతకుముందు కూడా చెప్పినట్లే నేను నా ఆటను ఎంజాయ్ చేస్తానంతే. నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. కష్టమైన పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌ను లాగేసుకోవాలని అనుకున్నప్పుడు.. వాళ్లపై ఎదురుదాడికి దిగడం నాకు ఇష్టం. దీని వల్ల జట్టుకు మంచి జరిగితే నాకూ సంతోషమే కదా' అని నవ్వేశాడు.

Story first published: Monday, January 9, 2023, 8:49 [IST]
Other articles published on Jan 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+