న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులోకి తీసుకుంటే ఆడదామనుకున్నా: గంభీర్

i would have played if picked says gautham gambhir

హైదరాబాద్: జట్టులో ఉంచుకోలేదని కోల్‌కతాకు దూరమైయ్యాడు. ఢిల్లీకి కెప్టెన్‌ని చేస్తే పరాజయాలు భరించలేక మధ్యలోనే తప్పుకున్నాడు. దాంతో జట్టు కొత్త రకంగా ట్రీట్ చేసింది. కెప్టెన్సీ లేకపోతే జట్టులో ఆడటానికే వీల్లేదనడంతో చేసేదేం లేక సగటు అభిమాని పాత్ర పోషించాడు గౌతం గంభీర్. ఇదీ ఐపీఎల్ పదకొండో సీజన్‌లో గౌతమ్ గంభీర్ పరిస్థితి. కోల్‌కతా టీమ్‌ను రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన గంభీర్.. ఢిల్లీ టీమ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఢిల్లీ టీమ్ ఐపీఎల్ నుంచి బయటకెళ్లిపోయినప్పటి నుంచి గంభీర్‌ను ఎక్కడికెళ్లినా ఓ ప్రశ్నతో వెంటాడుతూనే ఉంది. మళ్లీ జట్టులో ఎందుకు ఆడలేదంటూ అతనిని వేధిస్తుండటంతో.. అని. దీనికి సింపుల్‌గా గంభీర్ ఇచ్చిన సమాధానం.. టీమ్‌లోకి తీసుకుంటే ఆడేవాడిని' దీంతో ఆడేందుకు వీలు లేకుండాపోయిందంటూ సమాధానం చెప్పుకొచ్చాడు.

జట్టు వైఫల్యాల గురించి ఇంకా మాట్లాడుతూ.. ''ఈ సీజన్‌లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్‌ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో దారుణంగా విఫలమైందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

తన మీద వస్తున్న రూమర్లను కొట్టిపడేశాడు. 'క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని' వస్తున్న వార్తలను ఖండించాడు. ఇంకా చాలా రోజులు క్రికెట్ ఆడాల్సి ఉండగా ఇలాంటి పుకార్లు పుట్టించొద్దని వారించాడు. ఇక ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ను చూస్తున్నానని, తన పాత టీమ్ కోల్‌కతా నైట్‌రైడర్సే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ దినేష్ కార్తీక్ కెప్టెన్సీని ప్రశంసించాడు.

Story first published: Wednesday, May 23, 2018, 16:02 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X