'ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతా'
ముంబై: టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తానని 1983 వరల్డ్ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.
నాకు తెలిసి సెహ్వాగ్ చాలా ఉత్తేజకరమైన క్రికెటర్. అతనికి బౌలింగ్ వేయడమంటే నాకు ఇష్టం. ఎందుకంటే అతను మంచి బంతినీ వదలడు, చెత్త బంతిని కూడా షాట్ కొట్టగల సమర్ధుడని అన్నారు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

1999లో భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కపిల్ నెట్స్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు అవుట్ సింగర్లు విసిరేవాడని తెలిపారు. ఐదు ఓవర్లు మెయిడెన్ ఆడేవారికి బౌలింగ్ చేసినా, చేయకున్నా ఒకటేనని, కసిగా బంతి సంధించినప్పుడు అంతకంటే కసిగా బంతిని బౌండరీ లైన్ దాటించే ఆటగాడికి బౌలింగ్ చేయడంలో ఉండే మజాయే వేరని కపిల్ వెల్లడించారు.
ఇక ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్‌లో ఎలాంటి రికార్డునైనా అందుకోగల సత్తా ఉందని, అయితే అందుకు గాను అతను మెరుగవ్వాల్సిన అంశాలు ఉన్నాయని కపిల్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications