Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉరేసుకుని చచ్చిపోతా..!: భారత్‌తో వన్డే సిరిస్ ఓటమిపై కోచ్

: సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో జింబాబ్వే జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి 2-0 తేడాతో సిరి‌స్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో జింబాబ్వే జట్టు తాత్కాలిక కోచ్ ఎన్తీనిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

జింబాబ్వేతో హరారే వేదిగగా జరిగిన తొలి వన్డేలో ధోని సేన 9 వికెట్ తేడాతో విజయం సాధించగా, సోమవారం (జూన్ 13)న జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లో కూడా జింబాబ్వే బ్యాట్స్‌మెన్ ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది.

రెండు వన్డేల్లో కూడా టీమిండియా కెప్టెన్ ధోని టాస్ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి వన్డేలో జింబాబ్వే 168 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో వన్డేలో 126 పరుగులకే ఆలౌటై వన్డే సిరిస్‌ను 2-0తేడాతో చేజార్చుకుంది.

జింబాబ్వే ఆటగాళ్ల ప్రదర్శనపై జట్టు కోచ్ ఎన్తీ విసుగు చెందారు. 'ఉరేసుకుని చచ్చిపోయేంత పనిచేశా. బయట టమోటా చెట్టు గనుక ఉండి ఉంటే దానికి నేను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే వాడిని' అని భారత్ చేతిలో రెండో వన్డే ఓటమి అనంతరం ఆయన మీడియాకిచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు.

Makhaya Ntini

'ఇది బాగాలేదు. జట్టులో ఆటను ఆర్ధం చేసుకునే సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టులోని ఆటగాళ్లు మంచి పోజిషన్‌లో ఉన్నారు' అని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ పేర్కొన్నాడు. జింబాబ్వే జట్టు ప్రదర్శనపై జట్టు కోచ్ మాత్రమే కాదు ఆటగాళ్లు కూడా ఆసంతృప్తికి గురయ్యారు.

రెండో వన్డే జరుగుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు సైతం జట్టు ప్రదర్శన అత్యంత చెత్తగా ఉందని, ఇలా అయితే మేము మద్దతు తెలపలేమని ప్లకార్డులతో ఆటగాళ్ల ముందు ప్రదర్శించారు. ఇంకో ప్లకార్డులో మేము చాలా నిరాశకు గురయ్యామని అభిమానులు ప్రదర్శించారు.

జింబాబ్వే జట్టు ఆటగాళ్లను రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని స్టేడియంలో మరో అభిమాని ప్లకార్డు ప్రదర్శించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా మూడో వన్డే బుధవారం (జూన్ 13)న జింబాబ్వే, భారత్ జట్ల మధ్య జరగనుంది. అనంతరం శనివారం (జూన్ 18) నుంచి టీట్వంటీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+