For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోస్ బట్లర్ సెకండ్ వైఫ్‌గా ఉండడానికి నాకు అభ్యంతరం లేదు.. తోటి క్రికెటర్ భార్య సంచలన వ్యాఖ్యలు

‘I won’t mind being Buttler’s second wife’ says RR player van der Dussen’s wife Lara

దక్షిణాఫ్రికా ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రాస్సీ వాన్ డెర్ డస్సేన్‌కు ఐపీఎల్ 2022లో ఎక్కువ అవకాశాలైతే రాలేదు. ఇక రాస్సీ భార్య లారా వాన్ డెర్ డుస్సెన్ మాత్రం స్టాండ్స్‌లో కూర్చుని రాజస్థాన్ రాయల్స్‌ ఆడుతున్నప్పుడు భలే సపోర్ట్ చేస్తుంటుంది. తరచుగా చప్పట్లు, కేరింతలు కొడుతూ నానా హంగామా చేస్తుంది. చాహల్ భార్య ధనుశ్రీతో కలిసి స్టాండ్స్‌లో భలే సందడి చేస్తుంటుంది. ఇక జోస్ బట్లర్ సిక్సులు కొడుతున్నప్పడల్లా స్టాండ్స్ లో కూర్చున్న లారాపై కెమెరామాన్ ఫోకస్ చేయడం పెద్దతప్పయిపోయింది. లారాను అభిమానులు జోస్ బట్లర్ భార్య అని భావించారు. అందుకేనేమో అంత సందడి చేస్తుందంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. అయితే ఆమె ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. నేను బట్లర్ భార్యను కాను.. వాన్ డెర్ డస్సేన్ భార్యనని వివరించుకుంది.

ఎక్కువగా కెమెరా కంట్లో పడడంతో..

ఎక్కువగా కెమెరా కంట్లో పడడంతో..

ఈ సీజన్లో అరివీర భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ బ్యాటింగ్లో దంచికొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలతో టోర్నమెంట్‌లో తన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇప్పటివరకు 16గేమ్‌లలో 58.85సగటుతో 824పరుగులు చేసిన బట్లర్ నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో రాజస్థాన్‌ను గెలిపించి ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. బట్లర్ భార్య, అతని కుటుంబం కూడా గత వారం రాజస్థాన్ జట్టు బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ భార్య లారా ఎక్కువగా కెమెరా కంట పడడంతో ఆమెనే బట్లర్ భార్య అని అభిమానులు పొరపాటు పడ్డారు. అసలింతకీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన లారా.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ సీరియస్ గా ఆమె మనసులో ఆ థాట్ ఉందేమోనంటూ నెటిజన్లు కూడా కాస్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా

నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా

అభిమానులు నన్నే బట్లర్ భార్య అని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కొన్ని సార్లు కెమెరా కంట్లో పడడంతో బహుశా అలా అనుకుని ఉండుంటారు. అయినా పర్లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న బట్లర్‌కు రెండో భార్యగా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు (ఫన్నీగా). ధనశ్రీ, నేను మా ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాం. ఇక రాజస్థాన్ బ్యాటర్లు రాణిస్తుంటే.. ముఖ్యంగా బట్లర్ బాదుతుంటే స్టాండ్స్‌లో మస్తు హడావుడి చేశాం. నా హడావుడి చూసి నన్ను ఇలా బట్లర్ భార్యలాగా భావించి ఉంటారేమో. అయితే నా భర్త రాస్సీ వాన్ డెర్ డస్సెన్ తన ఆటను చూపించడానికి ఆయనకు తగినంత అవకాశాలు రాలేదు' అంటూ పేర్కొంది.

ఫైనల్లో గుజరాత్‌తో తాడో పేడో

ఫైనల్లో గుజరాత్‌తో తాడో పేడో

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా మే 29న గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. 2008లో ప్రారంభ ఎడిషన్లో ఫైనల్లో గెలిచిన రాజస్థాన్ ఆ తర్వాత మళ్లీ ఫైనల్ చేరుకోలేదు. ఇక తాజా సీజన్లో మరోసారి ఫైనల్ చేరుకుంది. దీంతో ఆ జట్టు విజయంపై చాలా ఆశలు పెట్టుకుంది.

Story first published: Saturday, May 28, 2022, 16:26 [IST]
Other articles published on May 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+