|
ఇంతకీ ఏం జరిగిందంటే..
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు చేసింది. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ రెండు పరుగులే చేసి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూం వెళ్తున్న క్రమంలో ఓ అభిమానిపై స్టోక్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు పారేసుకున్నాడు. గ్రౌండ్ బయటకొచ్చి మాట్లాడు.. నీ సంగతి చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నాడు
రాయలేనటువంటి బూతుపదాలను ఉపయోగించాడు. అయితే ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ప్రపంచం ముందు స్టోక్స్ దోషిగా నిలబడ్డాడు.యావత్ క్రికెట్ అభిమానుల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇక సదరు అభిమాని స్టోక్స్‌ను గేలిచేయడంతోనే అతను తిట్ల దండకం అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ అభిమాని మాట్లాడిన మాటలు కెమెరాకు చిక్కలేదు. సౌతాఫ్రికా జెర్సీ ధరించిన ఓ మధ్య వయస్కుడిలా కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాకుండా 50 మీటర్ల దూరం వరకు నడిచి స్టోక్స్‌ను తిట్టినట్లు కూడా పేర్కొన్నారు.
— Ben Stokes (@benstokes38) January 24, 2020 |
నన్ను క్షమించండి..
ఇక ఈ వ్యవహారంపై రేగిన దుమారంతో స్టోక్స్ తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు. ‘ఔటైన అనంతరం నేను మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెబుతున్నా. కెమెరాల్లో వినిపించిన నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. ఏదేమైనా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఔటై వస్తున్న క్రమంలో అభిమానుల గుంపు నుంచి తిట్లు వినిపించాయి. దాంతో ఆగ్రహానికి గురైన నేను అమార్యదకంగా వ్యవహరించాను. నేను వాడిన భాష పట్ల క్షమాపణలు చెబుతున్నా. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువకులు మ్యాచ్ చూసుంటారు. వారందరికి క్షమాపణలు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఇరుజట్ల నుంచి లభించిన మద్దతు అద్భుతం. ఈ ఒక చిన్న సంఘటన ఇంత మంచి వాతావరణాన్ని చెడగొట్టలేదని భావిస్తున్నా.'అని తన సుదీర్ఘ ట్వీట్లో పేర్కొన్నాడు.

ఐసీసీ చర్యలు..
అభిమానిని అసభ్య పదజాలంతో దూషించినందుకు ఐసీసీ స్టోక్స్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లెవెల్ వన్ అఫెన్స్‌గా పరిగణించి ఒక డీ మెరిట్ పాయింట్ విధించొచ్చు. నాలుగు డీ మెరిట్ పాయింట్లు ఆటగాళ్ల ఖాతాలో చేరితో నిషేధం ఎదుర్కొంటారు.

ఇంగ్లండ్ 192/4
ఇక ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(66),డామ్ సిబ్లే(44) శుభారంభాన్ని అందించారు. జాన్ డెన్లీ(27), స్టోక్స్(2) విఫలమైనా... జో రూట్(25 బ్యాటింగ్), పోప్(22 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.