Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనెక్కిడికీ పోరిపోను, ఇక్కడే ఉంటా: షోయబ్

I will stay here only: Shoaib
హైదరాబాద్: తాను ఇక్కడే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నారు. తనకు కాబోయే భార్య సానియా మీర్జాతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను అన్ని ప్రశ్నలకూ జవాబిస్తానని, తాను భారత్ లోనే ఉంటానని ఆయన చెప్పారు. తాను ఏ విధమైన తప్పూ చేయలేదని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తాను అయేషాను పెళ్లి చేసుకోలేదని ఆయన చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చానని, తనపై వచ్చిన ఆరోపణలు తొలగే వరకు తాను ఇక్కడే ఉంటానని ఆయన అన్నారు.

పాస్ పోర్టును పోలీసులు తీసుకోవడంపై ప్రతిస్పందిస్తూ వారు అవసరమనుకున్నారని, దానితో తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తాను పోలీసులకు సహకరిస్తున్నానని, పోలీసులు కావాలనుకున్నప్పుడు తాను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. తాను పెళ్లాడినట్లు చెబుతున్న అయేషా టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బదులు మీడియా ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఆరునూరైనా తమ పెళ్లి ఈ నెల 15వ తేదీన జరుగుతుందని సానియా మీర్జా చెప్పారు. తమకు సిద్దిఖి వ్యక్తిగతంగా తెలుసునని, సిద్దిఖి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె అన్నారు. ఆరోపణలు చేస్తున్న అయేషా వాటిని రుజువు చేయాలని ఆమె అన్నారు. షోయబ్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, న్యాయస్థానంలో నిజానిజాలు తేలుతాయని ఆమె అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+