న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓవర్‌త్రో నిర్ణయంపై ఎప్పటికీ చింతించను: అంపైర్

I will never regret the decision says Final Umpire Kumar Dharmasena

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ఓవర్‌త్రో నిర్ణయంపై ఎప్పటికీ చింతించను అని శ్రీలంక అంపైర్ కుమార్‌ ధర్మసేన అన్నారు. అయితే తాను తీసుకున్న ఆ నిర్ణయం తప్పే అని అంగీకరించాడు. కివీస్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ఇంగ్లండ్‌ విజయానికి ఆఖరి ఓవర్‌ చివరి మూడు బంతులకు 9 పరుగులు అవసరమయ్యాయి. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన నాలుగో బంతిని బెన్‌ స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. రెండో పరుగును కోసం ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవ‌డానికి క్రీజులోకి డైవ్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ గప్తిల్ విసిరిన బంతి స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి.

ఐసీసీ నిర్ణయంపై సీరియస్.. టీ20 ట్రై సిరీస్‌లో ఆడమని తేల్చేసిన జింబాబ్వేఐసీసీ నిర్ణయంపై సీరియస్.. టీ20 ట్రై సిరీస్‌లో ఆడమని తేల్చేసిన జింబాబ్వే

చర్చించిన తర్వాతే ఆరు పరగులు:

చర్చించిన తర్వాతే ఆరు పరగులు:

నిజానికి ఆ బంతికి 5 పరుగులే ఇవ్వాలి. అయితే బౌండరీతో కలిపి మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. దాంతో మ్యాచ్‌ టైగా ముగిసి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో అధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా ప్రకటించారు. మ్యాచ్‌ అధికారులతో పాటు ఫీల్డ్‌లోనే ఉన్న మరొక అంపైర్‌ ఎరాస్మస్‌తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ అంపైర్ కుమార్‌ ధర్మసేన తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు.

ఎప్పటికీ చింతించను:

ఎప్పటికీ చింతించను:

'ఓవర్‌త్రోకు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. టీవీ రీప్లేలు చూసిన తర్వాత ప్రజలు నిందించడం చాలా సులభం. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అదే సరైన నిర్ణయం అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ ప్రశంసించింది కూడా. ఆ నిర్ణయంపై ఎప్పటికీ చింతించను' అని ధర్మసేన తెలిపారు.

సూపర్‌ ఓవర్‌లో విజయం:

సూపర్‌ ఓవర్‌లో విజయం:

ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేయడంతో మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.

Story first published: Monday, July 22, 2019, 10:21 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X