Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో బౌలింగ్ అవకాశం లభిస్తే సత్తా చాటుతా'

India vs Australia : Shankar Has Said That He Will Try To Bowl Best In Australia Series.
I will look to express myself a lot more if I get to bowl, says Vijay Shankar ahead of Australia series

హైదరాబాద్: ఫిబ్రవరి 24 నుంచి స్వదేశంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్‌కు తెరలేవనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు శుక్రవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించారు. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో విజయ్ శంకర్‌కి టీ20, వన్డే జట్టులోనూ చోటు లభించింది. దీంతో ఆస్ట్రేలియాపై అవకాశం లభిస్తే అత్యుత్తమంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వెల్లడించాడు.

"నిదాహాస్ ట్రోఫీ సమయంలో నా లక్ష్యం కేవలం వికెట్లు తీయడమే. అయితే, ఇటీవల నా దృక్ప‌థం మారింది. మానసికంగా కూడా మెరుగయ్యా. ఇప్పుడు నా ఆలోచన అంతా వికెట్లు తీయడం కాదు.. సురక్షిత ప్రదేశంతో బంతులు విసిరి పరుగుల్ని కట్టడి చేయడం. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో బౌలింగ్ అవకాశం లభిస్తే.. గతంలో కంటే అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తా" అని అన్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో బౌలింగ్‌లో పెద్దగా రాణించకపోయినా... బ్యాటింగ్‌లో మాత్రం విజయ్ శంకర్ మెరుపులు మెరిపించాడు. దీంతో ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి మొదలవనున్న వరల్డ్ కప్‌కు బౌలింగ్‌లోనూ లయ అందుకోవాలని తాను ఆశిస్తున్నట్లు అతను వెల్లడించాడు.

Story first published: Saturday, February 16, 2019, 17:56 [IST]
Other articles published on Feb 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+