Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అత్యుత్తమ ప్రదర్శన చేస్తా, ఒక్క వరల్డ్‌కప్ కూడా గెలవకపోవడంపై'

 I will give my best in the World Cup, says South Africa quick Dale Steyn

హైదరాబాద్: రాబోయే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తెలిపాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. డేల్ స్టెయిన్‌కు బహుశా ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు. 35 ఏళ్ల డేల్ స్టెయిన్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో సైతం ఆడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐపీఎల్ 12వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన డేల్ స్టెయిన్ రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. తాజాగా, గాయం నుంచి కోలుకోని వరల్డ్‌కప్‌కు సిద్ధమయ్యాడు. డేల్ స్టెయిన్‌కు ఇది మూడో వరల్డ్ కప్ కావడం విశేషం.

స్టెయిన్ మాట్లాడుతూ

స్టెయిన్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో స్టెయిన్ మాట్లాడుతూ "ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. నా డ్రాయింగ్ రూమ్‌లో అన్ని ముఖ్యమైన ట్రోఫీలు ఉన్నాయి, ఒక్క వరల్డ్‌కప్ తప్ప. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ముందు వరల్డ్‌కప్ మెడల్‌ను సాధించాలి. చోకర్స్ టాగ్ గురించి ఎలాంటి బాధ లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్క వరల్డ్ కప్ కూడా నెగ్గలేదు" అని అన్నాడు.

1992 వరల్డ్‌కప్‌లో దురదృష్టం

1992 వరల్డ్‌కప్‌లో దురదృష్టం

"1992 వరల్డ్‌కప్‌లో మా అవకాశాలకు వర్షం దెబ్బకొట్టింది. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసినా... వరల్డ్‌కప్ నెగ్గలేకపోయాం" అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు. 1992 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, భారత్‌, జింబాబ్వేలపై వరుస విజయాలను నమోదు చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది.

13 బంతుల్లో 22 పరుగులు

13 బంతుల్లో 22 పరుగులు

సెమీఫైనల్లో చోటు చేసుకున్న ఓ అనూహ్య పరిమాణంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో సఫారీల విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.

1 బంతికి 22 పరుగులుగా అంఫైర్లు నిర్దారణ

1 బంతికి 22 పరుగులుగా అంఫైర్లు నిర్దారణ

మెక్‌మిలన్‌ (21 నాటౌట్‌), రిచర్డ్‌సన్‌ (13 నాటౌట్‌) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో 12 నిమిషాల పాటు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ వర్షం సఫారీల ఓటమికి కారణమైంది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లక్ష్యాన్ని 1 బంతికి 22 పరుగులుగా అంఫైర్లు నిర్దారించారు. ఆఖరి బంతికి సింగిల్‌ తీసి బ్యాట్స్‌మెన్‌ భారంగా మైదానాన్ని వీడారు. ఇక, 1999 వరల్డ్‌కప్‌లో సెమీపైనల్లో ఆసీస్ చేతిలో ఓడగా... ఆ తర్వాత 2007లో ఆస్ట్రేలియా చేతిలో 2015లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

Story first published: Thursday, May 16, 2019, 19:03 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+