న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేస్తా.. వార్నర్‌కు భువనేశ్వర్ అదిరే పంచ్!!

I will get you out in the first over: Bhuvneshwar Kumar gives a savage reply to David Warner
IPL 2020 : Bhuvneshwar Kumar Gives A Savage Reply To David Warner

సిడ్నీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఆట‌గాళ్లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ కార‌ణంగా మ్యాచ్, ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్న ప్లేయ‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఇటీవలే టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వరుస పెట్టి వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు లైవ్ సెషన్‌లో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు.

సచిన్‌ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు: గంగూలీసచిన్‌ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు: గంగూలీ

 వార్నర్ లైవ్ సెషన్:

వార్నర్ లైవ్ సెషన్:

డేవిడ్ వార్నర్ తాజాగా లైవ్ సెషన్ నిర్వహించగా.. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఇద్దరికి అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్‌ని ఊహిస్తూ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నని భువీకి వార్నర్ సంధించాడు. అయితే దీనికి భువనేశ్వర్ ఫన్నీగా సమాధానమిచ్చి నవ్వు తెప్పించాడు. భువీ సమాధానంతో లైవ్ సెషన్ మొత్తం కామెడీగా మారిపోయింది. ఇంతకీ భువీని వార్నర్ ఏం అడిగాడంటే..?.

ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేస్తా:

ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేస్తా:

'టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉంది. నేను క్రీజులో ఉంటే నువ్వు ఏ బంతిని

సంధిస్తావ్?' అని‌ భువనేశ్వర్ కుమార్‌ను డేవిడ్ వార్నర్ ప్రశ్నించాడు. వార్నర్ అడిగిన ప్రశ్నకి భువనేశ్వర్ సమాధానమిస్తూ ... 'వార్నర్ చివరి ఓవర్‌లో నేను నీకు బౌలింగ్ చేయను. ఎందుకంటే.. ఆ మ్యాచ్ ఫస్ట్ ఓవర్‌లోనే నిన్ను ఔట్ చేస్తా?' అని పంచ్ వేశాడు. ఈ ఆన్సర్‌తో వార్నర్‌కి ‌ఏం చెప్పాలో అర్థం కాలేదు.

నకుల్ బాల్ సంధిస్తావనుకుంటా:

నకుల్ బాల్ సంధిస్తావనుకుంటా:

ఆపై వార్నర్ మళ్లీ అదే ప్రశ్న అడిగి ఓ హింట్ కూడా ఇచ్చాడు. నా అంచనా ప్రకారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీ లైన్స్ దూరంగా ఉంటాయి కాబట్టి నకుల్ బాల్ సంధిస్తావనుకుంటున్నా అని అన్నాడు. 'కెప్టెన్, సహచర బౌలర్ల అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత ఫైనల్ బంతిపై తుది నిర్ణయం తీసుకుంటా' అని భువీ చెప్పుకొచ్చాడు. డేవిడ్‌ వార్నర్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.

 సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్:

సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్:

కరోనా భయంతో ఐపీఎల్ 2020 జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. తాజా పరిస్థితుల నడుమ రద్దైయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ రద్దయితే.. ఆ స్థానంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు అతడు కెప్టెన్ కూడా. ఐపీఎల్ జరిగితే వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, April 28, 2020, 13:45 [IST]
Other articles published on Apr 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X