లేదంటే కోల్‌కతా వెళ్లిపోతానని సచిన్‌తో చెప్పా:గంగూలీ
కోల్‌కతా: అమెరికాలో ప్రారంభం క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ సిరీస్ కోసం మాజీ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... తనను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దింపకుంటే తాను కోల్‌కతా ఫ్లైట్ ఎక్కి తిరిగి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు.
ఆయన ఈ వ్యాఖ్య సరదాగా చేశారు. గంగూలీ మంగళవారం నాడు ఉదయం దాదాపు అరగంట పాటు నెట్లో ప్రాక్టీస్ చేశాడు. గంగూలీ సచిన్ టెండుల్కర్ జట్టు సచిన్స్ బ్లాస్టర్స్ టీంలో ఉన్నాడు. షేన్ వార్న్‌తో నవంబర్ 7న తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సందర్భంగా గంగూలీ సరదాగా మాట్లాడారు. సిరీస్‌లో తాను ఓపెనింగ్‌గా దిగుతానని, అలా కుదరదంటే వెంటనే కోల్‌కతా విమానం పట్టుకొని తిరిగి వెళ్లిపోతానని సచిన్ టెండుల్కర్‌తో చెప్పానని సరదాగా అన్నారు.
వివిఎస్ లక్ష్మణ్‌కు వీసా సమస్య వచ్చిన అంశంపై మాట్లాడుతూ... అతనికి వీసా సమస్య వచ్చి పడిందని చెప్పాడు. దీంతో అతను కొంత ఆందోళనతో ఉన్నాడన్నాడు. అమెరికా కాన్సులేట్ అతనికి ఇవ్వడం లేదని సరదాగా చెబుతూ... మ్యాచ్ సమయానికి లక్ష్మణ్ ఉంటాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications