
ఐపీఎల్ లీగ్ ఆరంభానికి ముందే ఫిట్‌నెస్ సాధిస్తా
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే ఫిట్‌నెస్ సాధిస్తా. అందుకోసం చాలా కష్టపడుతున్నా. కాలి మడమ పూర్తిగా 90 డిగ్రీల కోణంలో తిరగబడడం నాకు చాలా నొప్పిని కలిగించింది. కాలి పైభాగం, మడమ పటిష్ఠంగా మారేలా ప్రత్యేకంగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. మ్యాచ్‌లో కాలిమడమ మలుచుకుపోవడం దురదృష్టకరం" అని అన్నాడు.

రెండో టెస్ ఆడేందుకు
"సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునేందుకు గాల్లోకి ఎగిరాను. కిందికి వాలే సమయంలో నా కాలి మడమ పూర్తిగా తిరగబడిన సమయంలో అదే కాలుపై నా శరీరబరువంతా వాలింది. రెండో టెస్ ఆడేందుకు నన్ను సిద్ధం చేయాలని జట్టు ఫిజియోలు ప్రయత్నించారు. ఆ సమయంలో నా కాలిమడమ మరింతగా వాచి నొప్పిని పెంచింది" అని షా అన్నాడు.

టెస్ట్ సిరీస్ ఆడకపోవడం నిరాశను కలిగించింది
"దీంతో భారత్ తిరిగి వచ్చి గాయానికి చికిత్స తీసుకున్నాను. ఆస్ట్రేలియాలో సవాల్ విసిరే పరిస్థితుల్లో ఆడటం నాకిష్టం. అక్కడి బౌన్స్‌ని నేను ఇష్టపడతా. అయితే, అక్కడి టెస్ట్ సిరీస్ ఆడకపోవడం నిరాశను కలిగించింది. భారత్ టెస్టు సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇంతకన్నా జరిగే మంచి ఏముంది" అని పృథ్వీ షా అన్నాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతోన్న పృథ్వీ షా
ఐపీఎల్‌లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఓ క్యాచ్ అందుకోబోయి పృథ్వీ షా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకుని భారత్‌కు తిరిగి వచ్చేశాడు.


Click it and Unblock the Notifications
