న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్-టు-వికెట్ బౌలింగ్ చేయటానికి ప్రయత్నిస్తా: తాహిర్‌

I was trying to bowl wicket-to-wicket says Imran Tahir

మ్యాచ్‌లలో ప్రణాళికలు అంటూ ఎక్కువగా ఏమీ ఉండవు. నా ప్రణాళిక ఒక్కటే.. వికెట్-టు-వికెట్ బౌలింగ్ చేయటానికి ప్రయత్నిస్తా అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ స్పిన్నర్ (40) ఇమ్రాన్‌ తాహిర్‌ తెలిపారు. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇమ్రాన్‌ తాహిర్‌ తన కోటా 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి కీలక 4 వికెట్లు తీసి కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. తాహిర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

మ్యాచ్ అనంతరం ఇమ్రాన్‌ తాహిర్‌ మాట్లాడుతూ... 'చెన్నై అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఈ విజయంలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు పెద్దగా ప్రణాళికలు అంటూ ఏమీ ఉండవు. నా ప్రణాళిక ఒక్కటే.. వికెట్-టు-వికెట్ బౌలింగ్ చేయటానికి ప్రయత్నిస్తా. దీంతో బ్యాట్స్‌మన్‌ ఒత్తిడికి లోనయి తప్పులు చేస్తాడు. ఇలానే చాలా వికెట్లు తీసాను' అని తాహిర్‌ తెలిపారు.

I was trying to bowl wicket-to-wicket says Imran Tahir

'నా భార్య, కొడుకు ఎల్లప్పుడూ నాకు అండగా ఉన్నారు. నా భార్య నా కోసం చాలా శ్రమిస్తోంది. ధోనీతో కలిసి బాగా హార్డ్ వర్క్ చేసాను, అతని నుండి చాలా నేర్చుకున్నా. చెన్నై జట్టులో భాగమైనందుకు గర్విస్తున్నా. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. చెన్నై మరిన్ని విజయాలు సాదించేందుకు నా వంతు కృషి చేస్తా' అని తాహిర్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, April 15, 2019, 15:03 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X