ఢిల్లీ: తాను బంతిని సరిగా తిప్పలేనని, వైవిద్యం అసలే లేదంటూ తన బౌలింగ్ పైన కొన్నాళ్ల క్రితం భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను తాను సానుకూలంగానే తీసుకున్నానని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రాణించి గవాస్కరను సంతోషపెడతానన్నాడు. గవాస్కర్ వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయని, ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదని, అందుకే ఆత్మపరిశీలన చేసుకున్నానని చెప్పాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ లాంటి వ్యక్తికే విమర్శలు తప్పలేదన్నాడు.

ఇక తాను ఎంత అని నేను అనుకొన్నానని చెప్పాడు. కాబట్టి గవాస్కర్ వ్యాఖ్యలను నేను సానుకూలంగా తీసుకున్నానని చెప్పాడు. తన బౌలింగ్ ద్వారా ఆ వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే గవాస్కర్ కూడా సంతోషపడతారన్నాడు.