Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా పేస్‌ దెబ్బకు హడలిపోయా.. పెర్త్‌లో టెస్టులోనైతే బెంబేలెత్తిపోయా: స్టార్ ఓపెనర్

I was scared of Indian seamers says Australia opener Marcus Harris

మెల్‌బోర్న్‌: టీమిండియా పేస్‌ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్‌ బౌలింగ్‌ విభాగం అత్యంత పటిష్టంగా మారిపోయిందన్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మతో కూడిన పేస్‌ త్రయం అద్భుత బంతులు వేస్తున్నారని హారిస్‌ కొనియాడాడు. 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వచ్చిన సందర్భంలో.. భారత పేస్‌ బౌలింగ్‌ విభాగం తనకు సవాల్‌గా మారిందని హారిస్‌ గుర్తుచేసుకున్నాడు.

టీవీల్లో చూస్తే దూకుడు కనిపించదు

టీవీల్లో చూస్తే దూకుడు కనిపించదు

అమెజాన్‌ ప్రైమ్ ఇటీవల విడుదల చేసిన సిరీస్‌ 'ద టెస్టు'లో మార్కస్‌ హారిస్‌ తన గత అనుభవాలను పంచుకున్నాడు. 'ఆ పర్యటనలో టీమిండియా పేస్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడానికి హడలిపోయా. ప్రత్యేకంగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్‌ పేసర్లు నన్ను విపరీతంగా బెంబేలెత్తించారు. టీవీల్లో చూస్తే పేస్‌లో దూకుడు అంతగా కనిపించి ఉండకపోవచ్చు. కానీ.. బుమ్రా, ఇషాంత్‌, షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు భీకరమైన బంతులతో చెలరేగిపోయారు. ప్రధానంగా మధ్య ఓవర్లలో వారు మరింత ప్రమాదకరంగా మారిపోయారు' అని హారిస్‌ పేర్కొన్నాడు.

హారిస్‌ హెల్మెట్‌కు తాకిన బంతి

హారిస్‌ హెల్మెట్‌కు తాకిన బంతి

పెర్త్‌ టెస్టులో మార్కస్‌ హారిస్‌ హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. బంతి తగలడంతో ఆసీస్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన బౌన్సర్‌ హారిస్‌ హెల్మెట్‌కు తాకింది. ఆ సమయంలో నాలుగు పరుగుల వద్ద ఉన్న హారిస్‌.. హెల్మెట్‌ను మార్చుకుని మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. ఆపై హారిస్‌ 20 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా.. బుమ్రా బౌలింగ్‌లోనే బౌల్డ్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. అయితే టెస్టు సిరీస్‌ను మాత్రం భారత్‌ 2-1తేడాతో కైవసం చేసుకుంది.

నా కంటే ఎంతో టాలెంటెడ్‌

నా కంటే ఎంతో టాలెంటెడ్‌

ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ 'ది టెస్ట్' డాక్యుమెంటరీలో భారత క్రికెట్‌ జట్టును ఆకాశానికెత్తేశాడు. 'భారతదేశం ప్రపంచంలోనే అత్యంత టాలెంట్ ఉన్న జట్టు. ఇప్పటికి భారత జాతీయ జట్టులో చోటు దక్కని క్రికెటర్లు నా కంటే ఎంతో టాలెంటెడ్‌. ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. భారత క్రికెట్‌లో ఉన్న టాలెంట్‌ మరేక్కడా లేదు' అని అన్నాడు. 2018-19 పర్యటనలో ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్, వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. ఇక టీ20 సిరీస్‌ 1-1తో సమం చేసుకుంది.

Story first published: Friday, March 20, 2020, 13:10 [IST]
Other articles published on Mar 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+