బాల్ ట్యాంపరింగ్!: ఏబీ డివిలియర్స్... ఎందుకంత కోపం?
హైదరాబాద్: శనివారం లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా జట్టును బాల్ ట్యాంపరింగ్ వివాదం చుట్టు ముట్టింది. అయితే ఈ వివాదంలో తమ తప్పు ఏదీ లేదని కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అంఫైర్లతో కాస్తంత ఘాటుగానే స్పందించాడు. తాము ఏ తప్పు చేయకపోయినా బాల్ ట్యాంపరింగ్ వివాదంపై అడగటం ఏంటని అంపైర్లను నిలదీశాడు.
వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ 33వ ఓవర్ తర్వాత మ్యాచ్‌లో ఉపయోగిస్తున్న రెండు బంతుల్లో ఒకటి దెబ్బతింది. దీంతో బాల్ టాంపరింగ్ జరిగిందా? అని అనుమానపడిన ఫీల్డ్ అంపైర్లు రాబ్ బైలీ, క్రిస్ గఫానీలు డివిలియర్స్‌ను పిలిచి వివరణ అడిగారు. దీంతో ఏబీకి తీవ్ర కోపం వచ్చింది.

ఆధారాలు లేకుండా నిందలు ఎలా వేస్తారు
అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ జట్టుపై నిందలు వేయడమేంటని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్బంగా టెస్ట్ కెప్టెన్ ఫా డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

జట్టును కాపాడుకోవం నా విధి
'దాదాపు దక్షిణాఫ్రికా జట్టు ట్యాంపరింగ్ పాల్పడిందనే నిందను వేయడానికి యత్నించారు. ఇక్కడ నా జట్టును కాపాడుకోవడమనేది నా విధి. ఎటువంటి పొరపాటు చేయకపోయినా మమ్ముల్ని ఇరికించే యత్నమైతే జరిగిందనేది నాకు అనిపించింది. దాంతో అంపైర్లతో తీవ్రంగా వాగ్వాదం చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో బంతి సరిగా లేనప్పుడు దానికున్న లెదర్ ఊడిపోతుంది' అని ఏబీ చెప్పాడు.

అంపైర్లు నా వాదనతో ఏకీభవించలేదు
'ఆ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాను. అయితే అంపైర్లు నా వాదనతో ఏకీభవించలేదు. మరొకవైపు మేము ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాకపోతే ఇక్కడ మేము అమాయకులం అనేది చివరకు తేలింది. మేము ట్యాంపరింగ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు' అని ఏబీ పేర్కొన్నాడు.

ఎల్‌ఈడీ బోర్డులకు తగిలి బంతి పాడై ఉండొచ్చు
ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరగలేదని నిర్ధారించుకున్న అంపైర్లు బంతిని మార్చలేదు. మరోవైపు ఎల్‌ఈడీ బోర్డులకు తగిలి బంతి పాడై ఉండొచ్చని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీ ను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications